అధికారులతో సిఎం టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, వైద్యసేవలందకే గిరిజనులు మరణించినట్లు చెప్పటం గమనార్హం. సమాచార లోపం వల్లే చాపరాయి ఘటనలు జరుగుతున్నట్లు చెప్పారు. త్రాగునీరు, పారిశుధ్యం, ఆహార అలవాట్లపై ఏజెన్సీ జనాల్లో చైతన్యం తేవాలట.
గిరిజన ప్రాంతంలోని చాపరాయిలో 20 మంది గిరిజనుల మరణాలకు అధికారులపైనే బాధ్యతను తోసేసారు. వైద్య సహాయం అందకే గిరిజనులు మరణించారన్నది వాస్తవం. అయితే, వైద్య సహాయాన్ని అందించాల్సిన బాధ్యత, అందేట్లు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అన్న మాటను మాత్రం చంద్రబాబునాయుడు మరచిపోయినట్లున్నారు. ఇదే విషయమై అధికారులతో అధికారులతో సిఎం టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ, వైద్యసేవలందకే గిరిజనులు మరణించినట్లు చెప్పటం గమనార్హం. సమాచార లోపం వల్లే చాపరాయి ఘటనలు జరుగుతున్నట్లు చెప్పారు. త్రాగునీరు, పారిశుధ్యం, ఆహార అలవాట్లపై ఏజెన్సీ జనాల్లో చైతన్యం తేవాలట.
ఇంత చెప్పారే కానీ ఆ ప్రాంతంలోని ప్రజాప్రతినిధులేం చేస్తున్నారని పార్టీ నేతలను ఒక్కసారి కూడా అడగలేదు. వర్షాలు పడేటపుడు గిరిజన ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు ప్రబలటం చాలా సహజం. అటువంటిది వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్వయంగా వైద్యునిగా ఉండి కూడా ఏం చేసారన్న ప్రశ్నకు సమాధానం లేదు. వైద్య బృందాలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యతను కూడా మంత్రి మరచిపోయారు. ఆ విషయాన్ని సిఎం ప్రస్తావించక పోవటం విచిత్రం.
ఇక, కామినేని అయితే మరీ విచిత్రం. అసలు చాపరాయిలో ఎవరూ జ్వరాలతో మరణించలేదని తేల్చేసారు. ఒక ఆవు మరణించిన మడుగులోని నీటిని తాగటం వల్లే కలుషిత నీటి వల్లే మరణించారని తేల్చేసారు. చేతబడి వంటి మూఢనమ్మకాలు కూడా కారణమట. అదేవిధంగా, నారా లోకేష్ అయితే, మూఢనమ్మకాల వల్లే మరణించారని చెప్పటం గమనార్హం. అంటే చంద్రబాబు ఒకమాట మాట్లాడితే మంత్రులోక మాట, చెబుతున్నారు. అందరూ కలిసి గిరిజన మరణాలను పూర్తిగా అధికారులపైనే తోసేయటం గమనార్హం.
