చంద్రబాబుకు గవర్నర్ ఫోన్: సీఎం రమేష్ ఆరోగ్యంపై ఆరా

First Published 25, Jun 2018, 11:19 AM IST
Governor Narasimhan phoned to CM Chandrababu Naidu
Highlights

బాబుకు సీఎం రమేష్ ఫోన్

అమరావతి:ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు  గవర్నర్ నరసింహన్ సోమవారం నాడు ఉదయం పోన్ చేశారు. ఈ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు గురించి ఆమరణ నిరహార దీక్ష చేస్తున్న టిడిపి ఎంపీ సీఎం రమేష్  ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొన్నారు.

ఈ నెల 20వ తేది నుండి  టిడిపి ఎంపీ సీఎం రమేష్ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నారు. సీఎం రమేష్‌తో పాటు ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడ దీక్ష చేస్తున్నారు. వీరిద్దరి దీక్ష సోమవారం నాటికి ఐదు రోజులకు చేరుకొంది.

టిడిపి ఎంపీ సీఎం రమేష్ ఆమరణ నిరహార దీక్షలు ఐదవ రోజుకు చేరుకొన్నాయి. సీఎం రమేష్ ఆరోగ్యం క్షీణిస్తోందని వైద్యులు ప్రకటించారు. అయితే అతడికి వైద్యం అవసరమని  డాక్టర్లు సూచిస్తున్నారు.

ఈ తరుణంలో సోమవారం నాడు  ఉదయం పూట గవర్నర్ నరసింహన్ ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఫోన్ చేశారు. టిడిపి ఎంపీ సీఎం రమేష్‌ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకొన్నారు. సీఎం రమేష్ ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్ నరసింహన్ సీఎం చంద్రబాబునాయుడును కోరారు.
 

loader