నెల్లూరు జిల్లా సంగం మండలంలోని దువ్వురు వద్ద జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాద సంఘటన పట్ల  ఆంధ్రప్రదేశ్ గవర్నర్  బిశ్వభూషణ్  హరిచందన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు . కార్మికులు ప్రయాణిస్తున్న ఆటోను అతివేగంగా ప్రయాణిస్తున్న పాల వాహనం  ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగిందని గవర్నర్ కు నెల్లూరు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. 

గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించినట్లు అధికారులు తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా హరించందన్ అదేశించారు. 

మృతుల కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంతాపం తెలిపిన గవర్నర్  ప్రమాద కారణంగా గాయపడిన వ్యక్తులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.