తనకు ప్రాణహాని ఉందంటూ వైసిపి మంగళగిరి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టులో పిటీషన్ వేశారు. గతంలో తనకున్న 2+2 భద్రతను ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే 1+1 కు కుదించినట్లు తన పిటీషన్లో ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కాకుండా చంద్రబాబునాయుడుకు వ్యతిరేకంగా ఓటుకునోటు, ఎంఎల్ఏల ఫిరాయింపులు, రాజధాని భూ ఆక్రమణలు, సదావర్తి భూములు లాంటి అనేక అంశాలపై పోరాడుతున్నట్లు చెప్పారు.

రాజధాని పరిధిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు మద్దతుగా ఆర్కె ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గడచిన మూడున్నరేళ్ళుగా ఆర్కె ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుమారు 40 కేసులు వేశారు. కొన్ని కేసుల్లో గెలవగా మరికొన్ని కేసులు విచారణ దశలో ఉన్నాయి.