Asianet News TeluguAsianet News Telugu

ఏపీలో మాస్కులతో విధులకు హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు: వీరికి మినహాయింపులు....

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం ఉద్యోగులు హాజరు కావాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు గురువారం నాడు  ఉద్యోగులతో సందడిగా కన్పించాయి. 

Government employees attends for their duties in Andhra pradesh
Author
Amaravathi, First Published May 21, 2020, 11:14 AM IST

అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో వంద శాతం ఉద్యోగులు హాజరు కావాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు గురువారం నాడు  ఉద్యోగులతో సందడిగా కన్పించాయి. 

కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులు కొందరికి వర్క్ ఫ్రం హోమ్ అవకాశం కల్పించింది ప్రభుత్వం. కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో యధావిధిగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

also read:రెండు నెలల తర్వాత: రేపటి నుంచి విధులకు హాజరుకానున్న ప్రభుత్వ ఉద్యోగులు

విజయవాడ, గుంటూరు నుండి ప్రత్యేక బస్సుల్లో ఉద్యోగులు సచివాలయానికి చేరుకొన్నారు. ఉద్యోగులు విధిగా మాస్కులు ధరించారు. సచివాలయంతో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కూడ ఉద్యోగులు విధులకు హాజరయ్యారు.

ఇవాళ రేపు ఆఫ్షనల్ హాలిడే కావడంతో ఉద్యోగుల హాజరు కొంచెం తక్కువగా ఉన్నట్టుగా అధికారులు చెప్పారు.హైద్రాబాద్ నుండి నేరుగా ఉద్యోగులు విధులకు హాజరయ్యేలా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని ఉద్యోగులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానిని కోరాలని ఉద్యోగులు భావిస్తున్నారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు భౌతిక దూరం పాటిస్తూ విధులు నిర్వహించనున్నారు. గర్భవతులు, ఎక్కువ వయస్సుగల వారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రం పరిస్థితుల ఆధారంగా వర్క్ ఫ్రమ్ హోం కి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

also read:ఎల్జీ పాలీమర్స్‌కు కాంగ్రెస్, వైసీపీ అనుమతులు, ఇవిగో ఆధారాలు: జగన్ కు బాబు సవాల్

మాన్యువల్ కాకుండా ఈ ఫైల్స్ కే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.మరో వైపు ఉద్యోగులు వెళ్లిపోయిన తర్వాత ప్రతి కార్యాలయాన్ని శానిటేషన్ చేయాలని ప్రభుత్వం ఆయా ప్రభుత్వ కార్యాలయాల ఉన్నతాధికారులను ఆదేశించింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios