అమరావతి: ఎల్జీ పాలీమర్స్ కు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుమతిస్తే.. వైసీపీ ప్రభుత్వం విస్తరణ పనులకు క్లియరెన్స్ ఇచ్చిందని టీడీపీ చంద్రబాబునాయుడు చెప్పారు.ఈ విషయమై ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 

బుధవారం నాడు హైద్రాబాద్ లో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీకి  కాంగ్రెస్ ప్రభుత్వం హయంలోనే రెండు దఫాలు అనుమతులు ఇచ్చారని చంద్రబాబు చెప్పారు. టీడీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడ ఎల్జీ పాలీమర్స్ ప్యాక్టరీకి అనుమతులు ఇవ్వలేదన్నారు.

also read:పోతిరెడ్డిపాడుపై రాష్ట్రం హక్కును కాపాడాలి, తండ్రి మాదిరిగానే కొడుకు: జగన్ పై బాబు సెటైర్లు

జగన్ ప్రభుత్వం ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ విస్తరణ పనులకు అనుమతులు ఇచ్చినట్టుగా చెప్పారు. ఎల్జీ పరిశ్రమకు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూమిని ఇచ్చినట్టుగా ఆయన గుర్తు చేశారు. రెండు సార్లు కాంగ్రెస్ ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. 

ఎల్జీ పాలీమర్స్ విస్తరణ పనులకు అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు. జగన్ ప్రభుత్వమే  ఈ ఫ్యాక్టరీ అనుమతి ఇచ్చిందన్నారు.ఈ ఫ్యాక్టరీ విస్తరణ పనులకు సంబంధించి ఆధారాలను   ఇచ్చాను.... మీ దగ్గర ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన సవాల్ విసిరారు. తప్పుడు లెక్కలు రాసుకొని జైలుకెళ్లి వచ్చారని ఆయన పరోక్షంగా జగన్ పై విమర్శలు గుప్పించారు.

40 ఏళ్లుగా రాజకీయాల్లో నీతి, నిజాయితీతో ఉన్నానని ఆయన చెప్పారు. వేల కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.