Asianet News TeluguAsianet News Telugu

ఒంగోలు టీడీపీ నేతలకు జగన్ షాక్: గొట్టిపాటి, పోతుల రామారావు గ్రానైట్ క్వారీ లీజుల రద్దు

ప్రకాశం జిల్లా టీడీపీ నేతలకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. గ్రానైట్ క్వారీ లీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

government abolished granite lease of tdp leaders gottipati ravikumar and potula ramarao
Author
Ongole, First Published Aug 25, 2020, 11:00 AM IST

ఒంగోలు: ప్రకాశం జిల్లా టీడీపీ నేతలకు రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. గ్రానైట్ క్వారీ లీజులను రద్దు చేస్తూ ప్రభుత్వం మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుల  గ్రానైట్  క్వారీ లీజులను రద్దు చేసింది ప్రభుత్వంక్వారీయింగ్ లో లోపాలు ఉన్నాయని  ఈ లీజులను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు చెందిన ఒక క్వారీ, ఆయన నన్నిహితుల ఆరు క్వారీలు, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన ఒక క్వారీ లీజును రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ఈ గ్రానైట్ తవ్వకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఈ కంపెనీలకు పెద్ద ఎత్తున జరిమానాలను కూడ విధించారు.  

రాజకీయంగా  ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశ్యంతోనే  టీడీపీకి చెందిన నేతల గ్రానైట్ కంపెనీల్లో తనిఖీలు నిర్వహించడమే కాకుండా భారీ మొత్తంలో జరిమానాలు విధించారని అప్పట్లో టీడీపీ నేతలు విమర్శించారు.

తమ పార్టీకి చెందిన నేతలు, ప్రజా ప్రతినిదుల వ్యాపారాలను దెబ్బతీసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరిస్తోందని టీడీపీ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios