Asianet News TeluguAsianet News Telugu

జగన్ నివాసలో ఆరు ఆవులతో గోశాల ఏర్పాటు.. !!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసంలో గోశాల ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి ఆరు ఆవులను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తీసుకొచ్చారు. ఆ గోవులకు జగన్ సతీమణి వైఎస్ భారతి పూజలు చేసి గోశాలకు తరలించినట్లు అనధికారిక సమాచారం. 

Goshala set up with six cows at Jagan residence in andhrapradesh
Author
Hyderabad, First Published Nov 29, 2021, 1:43 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి YS Jagan Mohan Reddy తాడేపల్లి నివాసంలో Goshala ఏర్పాటు చేశారు. తిరుపతి నుంచి Six cowsను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి తీసుకొచ్చారు. ఆ గోవులకు జగన్ సతీమణి వైఎస్ భారతి పూజలు చేసి గోశాలకు తరలించినట్లు అనధికారిక సమాచారం. 

అయితే, సడన్ గా గోశాల ఏర్పాటుపై వైసీపీ నాయకుల్లో, ప్రభుత్వ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. 

ఇదిలా ఉండగా, జగన్ ఆ భయంతోనే ఇల్లు కదలడం లేదంటూ నాదెండ్ల మనోహర్ ఆదివారం నాడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంపై janasena party పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్ధితులు ఏర్పడ్డాయని.. స్వ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థను వారు అనుకున్న పథకాలకు పరిమితం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. ఏ మాత్రం పరిపాలనా దక్షత లేని నాయకుడి వల్ల ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందని నాదెండ్ల ఎద్దేవా చేశారు. 

డాలర్ శేషాద్రి హఠాన్మరణం టిటిడికి తీరనిలోటు: సీఎం జగన్, చంద్రబాబు సంతాపం

రూ. 6 లక్షల కోట్ల అప్పులు  చేసినట్లు కాగ్ లెక్కలు చెప్పిందని.. మరి ఈ అప్పు ఎటుపోయిందని నాదెండ్ల ప్రశ్నించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మౌలిక వసతుల కల్పన కోసం ఒక్క అడుగు వేసింది లేదని మనోహర్ ఎద్దేవా చేశారు. యువకుడని జనం జగన్‌కి ముఖ్యమంత్రి పదవి అప్పగించారని.. ఆయనేమో ఇంటి నుంచే పనిచేస్తున్నారని మనోహర్ దుయ్యబట్టారు. 

ప్రజల దగ్గరకు వెళితే ఏం అడుగుతారో భయం వచ్చేసిందని.. వేలాది మంది పోలీసుల సాయం లేనిదే బయటకు పోవడం లేదని ఆయన ఆరోపించారు. గత నెలలో ఒంగోలులో ఓ సభ పెట్టారని.. మహిళలకు ఆసరా పధకం కింద బటన్ నొక్కి ఖాతాల్లో జమ చేశారని.. ఈ మీటింగ్‌కు రాష్ట్ర నలుమూలల నుంచి పోలీసుల్ని తీసుకొచ్చారని మనోహర్ దుయ్యబట్టారు. శాసనసభ సమావేశాలు నిర్వహిస్తున్న తీరు చూస్తే అసహ్యం వేస్తోందని.. గతంలో శాసనసభలో గారుకు బదులు గాడు అంటే వెంటనే స్పీకర్ కల్పించుకుని క్షమాపణలు చెప్పించారని ఆయన గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఆ గౌరవం ఎక్కడా కనిపించడం లేదని మనోహర్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక గత గురువారం నాడు తిరుపతిలో Nadendla Manohar మీడియాతో మాట్లాడుతూ... ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవడంలో Ys jagan ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు కూడా సరిగా లేదని  మనోహర్ ఆరోపించారు.kadapa జిల్లాలోని మండపల్లె గ్రామంలోనే  15 పశువులు వరదలో మృత్యువాత పడ్డాయని ఆయన చెప్పారు.  రాష్ట్రంలో Heavy rains కారణంగా జరిగిన నష్టంపై కచ్చితమైన లెక్కలు ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. crop నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ఆయన కోరారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios