ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల అధికారిని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఇప్పటి వరకు ఏపీ చీఫ్ ఎలక్టోరల్ అధికారిగా ఉన్న ఆర్పీ సీసోడియా స్థానంలో గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తూ సీఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత నవ్యాంధ్ర తొలి ఎన్నికల ప్రధానాధికారిగా సిసోడియా సేవలు అందించారు. త్వరలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న  నేపథ్యంలో కేంద్రప్రభుత్వం గోపాలకృష్ణను సీఈసీని మార్చడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.