కరెంటు బిల్లులు ఇకపై ఇలా కట్టాలి (స్టెప్ బై స్టెప్ గైడ్). గూగుల్‌పే, ఫోన్‌పే పని చేయవు

‘‘RBI మార్గదర్శకాలను అనుసరించి ఇకమీదట PhonePe , GPay , PayTM, ఇతర UPI apps నందు మీరు బిల్లులు చెల్లించుటకు మా డిస్కమ్ పేరు కనిపించదు’’ అని APCPDCL పేర్కొంది. మరి ఎలా చెల్లించవచ్చు.

GooglePay, PhonePay not working..? Pay electricity bill like this GVR

రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కీలక నిర్ణయం కారణంగా జూలై 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. కరెంటు (విద్యుత్‌) బిల్లుల చెల్లింపుల్లో సమర్థత, సెక్యూరిటీ పరమైన అంశాలకు ప్రాధాన్యమిస్తూ కొత్త రూల్స్‌ తీసుకొచ్చింది. ఇకపై కరెంట్ బిల్లు పేమెంట్స్‌ అన్నీ భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ (BBPS) ద్వారానే జరపాలని నిర్ణయించింది. 

ఈ నేపథ్యంలో భారత్‌ బిల్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను బిల్లర్లు ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు పలు ప్రధాన ప్రైవేటు బ్యాంకులు BBPSని యాక్టివేట్‌ చేసుకోలేదు. దీంతో చాలావరకు పేమెంట్స్‌ నిలిచిపోయాయి.

జూన్ 30 తర్వాత క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ అన్నీ భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్-BBPS ద్వారా ప్రాసెస్ చేయాలని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆదేశించింది. కాగా, HDFC, ICICI, యాక్సిస్ లాంటి కొన్ని బ్యాంకులు సిస్టమ్(BBPS)ని  ప్రారంభించలేదు. దాదాపు 5కోట్ల క్రెడిట్‌ కార్డులు జారీ చేసిన ఈ బ్యాంకులతో పాటు జీపే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్‌లు కూడా BBPSని ఎనేబుల్‌ చేయలేదు. దీంతో ఇప్పుడు ఆయా బ్యాంకింగ్‌ యాప్‌లు, యూపీఐ యాప్స్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల నుంచి నేరుగా బిల్లలు చెల్లించడం వీలు కావడం లేదు. 

ఈ నేపథ్యంలో ‘‘RBI మార్గదర్శకాలను అనుసరించి ఇకమీదట PhonePe , GPay , PayTM, ఇతర UPI apps నందు మీరు బిల్లులు చెల్లించుటకు మా డిస్కమ్ పేరు కనిపించదు’’ అని APCPDCL పేర్కొంది. 

కాబట్టి వినియోగదారులు APCPDCL Consumer appని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసికొని.. లేదా.. డిస్కమ్ వెబ్‌సైట్‌ https://apcpdcl.in/ నుంచి గానీ బిల్లులు చెల్లించవచ్చు.

ఇదే సౌలభ్యాన్ని APCPDCLతో పాటు APSPDCL, APEPDCL డిస్కమ్‌లు కూడా కల్పించాయి. మీరు ఏ డిస్కమ్‌ పరిధిలోకి వస్తే ఆ డిస్కమ్‌కు సంబంధించిన యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి మొబైల్‌లో‌ డౌన్‌లోడ్‌ చేసుకుని బిల్లులు చెల్లించవచ్చు. లేదా నేరుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లి బిల్లులు చెల్లించవచ్చు. అయితే, వినియోగదారులు డిస్కంల యాప్‌/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి పేమెంట్‌ చేసే సమయంలో... PhonePe , GPay , PayTM లేదా ఇతర UPI appsని వాడవచ్చు. అలాగే మీ డెబిట్, క్రెడిట్ , నెట్ బ్యాంకింగ్, వాల్లెట్స్, కాష్ కార్డ్స్ కూడా వాడవచ్చు.


ఏ డిస్కమ్‌ పరిధిలో ఏ ప్రాంతం...
ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు ఏపీ సెంట్రల పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ (APCPDCL) పరిధిలోకి వస్తాయి. దీని పరిధిలోని వినియోగదారులు గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి Central Power యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొని కరెంటు బిల్లు చెల్లించవచ్చు. లేదా డిస్కం వెబ్‌సైట్‌ https://apcpdcl.in/ ద్వారా కూడా బిల్లు పే చేయొచ్చు. 

ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌ కడప, నెల్లూరు జిల్లాలు ఏపీ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కార్పొరేషన్‌ (APSPDCL) పరిధిలో ఉన్నాయి. గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి Southern Power యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసుకొని కరెంటు బిల్లులు చెల్లించవచ్చు. www.apspdcl.in వెబ్‌సైట్‌ ద్వారా బిల్లులు చెల్లించే అవకాశం ఉంది. 

అలాగే, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ఈస్ట్రన్‌ పవర్‌ కార్పొరేషన్‌ (APEPDCL) పరిధిలోకి వస్తాయి. ఈ డిస్క్‌మ్‌ పరిధిలోని వినియోగదారులు Eastern Power యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని బిల్లులు కట్టవచ్చు. లేదా డిస్కం వెబ్‌సైట్‌ apeasternpower.com ద్వారా బిల్లులు చెల్లించవచ్చు.

GooglePay, PhonePay not working..? Pay electricity bill like this GVR

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios