విజయవాడ- చెన్నై రైల్వే మార్గంలో గూడ్స్ రైలు  పట్టాలు తప్పింది. గుంటూరు జిల్లా పరిధిలోని చుండూరు-నిడుబ్రోడుల స్టేషన్ల మధ్య ఈ ఘటన జరిగింది. దీంతో చెన్నై మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

డౌన్‌లైన్‌లోకి రైళ్లను మళ్లిస్తుండటం వల్ల రాకపోకల్లో ఆలస్యం జరిగే అవకాశం వుందని అధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రైలు మార్గాన్ని పునరుద్ధరిస్తున్నారు.