ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు తీపికబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ ఆర్థిక శాఖ నుండి అనుమతి లభించింది. దీంతో ఈ ఉద్యోగాల భర్తీకి అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. 

ఆర్థిక శాఖ నుండి అనుమతి లభించిన 2684 ఉద్యోగాల్లో పోలీస్ శాఖ కు చెందిన ఉద్యోగాలే ఎక్కువగా ఉన్నాయి. పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో దాదాపు 2500 పోస్టుల భర్తీని చేపట్టనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పోలీస్ నియామక మండలిని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఉద్యగోలకు ఈ నెలలోనే నోటిఫికేన్ విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఐదు నెలల్లోపే నియామక ప్రక్రియ పూర్తి చేసి నియామకాలు జరిగేలా చేడాలని ప్రభుత్వం నుండి స్పష్టమైన ఆదేశాలున్నట్లు అధికారులు  తెలిపారు.

ఇప్పటికే డీఎస్సి నోటిపికేషన్ ద్వారా ప్రభుత్వం టీచర్ల నియామకం చేపట్టిన విషయం తెలిసిందే.  మరో డీఎస్సీ కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో నిరుద్యోగులు వీటికోసం ప్రిపరేషన్ లో వున్నారు. తాజాగా ఈ పోలీస్ శాఖ లో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి లభించడంతో నిరుద్యోగ యువత తమమ ప్రిపరేషన్ మరింత ముమ్మరం చేయనున్నారు. 
 

మరిన్ని వార్తలు

చంద్రబాబు నిరుద్యోగ భృతిపై జోకులు పేల్చిన పవన్ కల్యాణ్

అధికారంలోకి వచ్చిన 100రోజుల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ:రాజనర్సింహ

తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త : ఎన్నికల కోసం 1,043 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త.. వేలాది ఉద్యోగాలు

నిరుద్యోగులకు శుభవార్త...46,290 ఉద్యోగాలపై ఆర్థిక మంత్రి ప్రకటన

నిరుద్యోగులకు శుభవార్త...6,603 పంచాయతీ కార్యదర్శి పోస్టులు