పలు శాఖల్లో ఖాళీగా ఉన్న 20వేలకు పైగా పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు.
ఏపీలో నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. పలు శాఖల్లో ఖాళీగా ఉన్న 20వేలకు పైగా పోస్టుల భర్తీకి సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గ్రూప్-1,2,3, డీఎస్సీ, పోలీసు శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఈ ఉదయం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో చంద్రబాబు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏయే శాఖల్లో ఖాళీలు ఉన్నాయనేదానిపై ఆధికారులతో సమీక్షించారు. 20,010 ఖాళీల భర్తీకి ఈ సమావేశంలో సీఎం ఆమోదం తెలిపారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఈ నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నియామకాల ప్రక్రియను త్వరిత గతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో దీనిపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Sep 19, 2018, 9:29 AM IST