Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. 8 వేల‌కు పైగా టీచ‌ర్ పోస్టులు భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌భుత్వం వెల్ల‌డి

AP Assembly: చంద్ర‌బాబు అరెస్టు క్ర‌మంలో టీడీపీ నిరసన కొనసాగడంతో ఏపీ అసెంబ్లీలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు చర్చకు ఆసక్తి చూపడం లేదనీ, సభలో అధికార పార్టీ సభ్యులను రెచ్చగొడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరు సరికాదని, ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇదిలావుండ‌గా, శాస‌న మండ‌లిలో టీడీపీ సభ్యుల నిరసనల మధ్య బొత్స స‌త్య‌నారాయణ టీచ‌ర్ పోస్టుల‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 

Good news for the unemployed. More than 8,000 teacher posts will be filled up, says Botsa Satyanarayana RMA
Author
First Published Sep 22, 2023, 2:53 PM IST

Botsa Satyanarayana: చంద్ర‌బాబు అరెస్టు క్ర‌మంలో టీడీపీ నిరసన కొనసాగడంతో ఏపీ అసెంబ్లీలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలు చర్చకు ఆసక్తి చూపడం లేదనీ, సభలో అధికార పార్టీ సభ్యులను రెచ్చగొడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరు సరికాదని, ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఇదిలావుండ‌గా, శాస‌న మండ‌లిలో బొత్స స‌త్య‌నారాణ‌య టీచ‌ర్ పోస్టుల‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీ శాస‌న మండ‌లిలో విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాణ‌య టీచ‌ర్ పోస్టుల‌కు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఖాళీగా ఉన్న ఎనిమిది వేల‌కు పైగా టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ఈ విష‌యంలో తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌నీ, మెరుగైన విద్యాను రాష్ట్రంలో అందిస్తున్నామ‌ని చెప్పారు. చంద్ర‌బాబు అరెస్టు పై టీడీపీ స‌భ్యులు ప్ర‌వ‌ర్త‌న‌పై మంత్రి తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌మావేశాల‌కు అంత‌రాయం క‌లిగించ‌డం త‌గ‌ద‌నీ, చంద్ర‌బాబు అరెస్టుపై చ‌ర్చ‌కు తాము సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు.

చంద్ర‌బాడు అరెస్టుతో పాటు ఏ అంశమైన చ‌ర్చ‌కు సిద్ధ‌మ‌నీ, దాని కోసం ఎంత స‌మ‌య‌మైన ఇస్తామ‌ని తెలిపారు. కావాల‌నే టీడీపీ స‌భ్యులు రెచ్చ‌గొడుతున్నార‌ని ఆరోపించారు. చైర్మ‌న్ పై దౌర్జ్యన్యానికి దిగ‌డం స‌రికాద‌ని అన్నారు. స‌మావేశాల‌ను ఇలా అడ్డుకోవ‌డం, ప్ర‌జా ధ‌నాన్ని దుర్వినియోగం చేయ‌డం త‌గ‌ద‌ని హితవు ప‌లికారు. కాగా, మంత్రి బొత్స టీచ‌ర్ పోస్టుల ప్ర‌క‌ట‌న‌పై ఎమ్మెల్సీ కేఎస్ ల‌క్ష్మ‌ణ‌రావు మాట్లాడుతూ.. కేంద్ర మాన‌వ వ‌న‌రుల శాఖామంత్రి ఆంధ్ర‌ప్రదేశ్ లో 40 వేల‌కు పైగా టీచ‌ర్ ఉద్యోగాలు ఉన్నాయ‌ని చెప్పార‌ని అన్నారు. అయితే, మంత్రి బొత్స మాత్రం 8 వేల టీచ‌ర్ ఉద్యోగాల‌ను మాత్ర‌మే భ‌ర్తీ చేస్తామ‌ని చెబుతున్నార‌నీ, ఇది స‌రికాద‌ని విమ‌ర్శించారు. మెగా డీఎస్సీని ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios