Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. మహాశివరాత్రికి వరుసగా మూడు రోజుల సెలవు
విద్యార్థులకు తెలుగు రాష్ట్రాలు గుడ్ న్యూస్ చెప్పాయి. ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు మహాశివరాత్రికి మూడు రోజుల సెలవులు ప్రకటించాయి. మార్చి 8వ తేదీన మహాశివరాత్రి. 8వ, 9వ(రెండో శనివారం), 10వ (ఆదివారం) వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి.
Holidays: విద్యార్థులకు మరో గుడ్ న్యూస్. మరోసారి వారికి సెలవులు రానున్నాయి. వచ్చే నెల 8వ తేదీన మహాశివరాత్రి పర్వదినం ఉన్నది. మహా శివరాత్రి కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు వరుసగా మూడు రోజుల సెలవు ప్రకటించాయి.
సాధారణంగా మహాశివరాత్రికి ప్రభుత్వం ఒక్క రోజే సెలవు ఇస్తుంది. మహాశివరాత్రి తొలి రోజే సెలవు ఉంటుంది. కానీ, ఈ సారి మూడు రోజులు సెలవు ఇస్తున్నది. మహా శివరాత్రి వచ్చే నెల 8వ తేదీన వస్తున్నది. అదీ శుక్రవారం రోజే వస్తున్నది. దీంతో తర్వాతి రోజు రెండో శనివారం కావడం, ఆ తర్వాత ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల సెలవు వస్తున్నది.
Also Read: Power Cut: మంత్రి మీటింగ్‌లో పవర్ కట్.. సీతక్క మాట్లాడుతుండగానే చీకటిమయం!
దీంతో విద్యా శాఖ మూడు రోజులు సెలవులను మంజూరు చేస్తూ ప్రకటించింది. వచ్చే నెలలో మహాశివరాత్రి కోసమే కాదు.. మార్చి 25వ తేదీన హోలీ పండుగ, మార్చి 29వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా సెలవులు ఉన్నాయి.