రైతులకు గుడ్ న్యూస్ : రేపే ఖాతాల్లోకి పీఎం కిసాన్ సొమ్ము..
నవంబర్ 15న పీఎం కిసాన్ సొమ్ము రైతుల ఖాతాల్లోకి విడుదల కానున్నాయి.
అమరావతి : ఈనెల 15వ తేదీన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి 15వ విడత సొమ్మును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విడుదల చేయనున్నారు. ఈ మేరకు కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్లో 41.73 లక్షల లబ్ధిదారులకు పిఎన్ కిసాన్ చెల్లింపులు జరిగాయి. ఆ తరువాత ఈ ఏడాది ఆగస్టు-నవంబర్ మధ్య పిఎం కిసాన్ సమ్మాన్ నిధి నగదు విడుదల చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన రూ.2వేలు ఇప్పుడు చెల్లిస్తారు.
అయితే ఈసారి పీఎం కిసాన్ సొమ్ము కింద ఎంత మంది రైతులకు నగదు అందం ఉన్నదో ఇంకా స్పష్టత లేదు. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హత కలిగి, ఈకేవైసీ పూర్తి చేసిన రైతులందరి అకౌంట్లలో నగదు జమవుతుందని అధికారులు చెబుతున్నారు.