అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు వైయస్ జగన్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా సెక్రటేరియట్ లో అడుగుపెట్టినప్పుడు ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. 

ఇచ్చిన మాటకు కట్టుబడి ఐఆర్ ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 27 శాతం మేర మధ్యంతర భృతికి  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జులై నుంచి మధ్యంతర భృతి వర్తించేలా ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని తొలి కెబినెట్ భేటీలోనే వైయస్ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.