Asianet News TeluguAsianet News Telugu

అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ శుభవార్త

కాగా.. జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే అగ్రి గోల్డ్‌ బాధితుల కోసం రూ.1,150 కోట్లు కేటాయించారు. తొలి దశలో రూ.263.99 కోట్లు విడుదల చేసి.. గతేడాది అక్టోబర్‌లో డిపాజిటర్లకు చెల్లింపులు జరిపారు.
 

Good News For Agri gold Victims From CM YS Jagan
Author
Hyderabad, First Published Dec 15, 2020, 1:03 PM IST

అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో శుభవార్త తెలియజేశారు. ఇటీవల ఆయన అగ్రిగోల్డ్ బాధితులకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ హామీని అమలు చేసే పనిలో పడ్డారు. సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే రూ.10వేల లోపు నగదు డిపాజిట్ చేసిన వారికి ఆ మొత్తాలను చెల్లించిన సంగతి తెలిసిందే.

కాగా.. జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే అగ్రి గోల్డ్‌ బాధితుల కోసం రూ.1,150 కోట్లు కేటాయించారు. తొలి దశలో రూ.263.99 కోట్లు విడుదల చేసి.. గతేడాది అక్టోబర్‌లో డిపాజిటర్లకు చెల్లింపులు జరిపారు.


రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి సైతం నగదు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. తెలంగాణ హైకోర్టు గత నెల 9న ఇందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో ఏపీ సీఐడీ నేతృత్వంలో వార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్‌దారుల వివరాలను సేకరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్చి నాటికి రూ.20 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ చెప్పారు.
  
 

Follow Us:
Download App:
  • android
  • ios