విజయవాడలో ఏడు కిలోల బంగారం సీజ్: నలుగురు అరెస్ట్
విజయవాడలో బంగారం స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
విజయవాడ: బంగారం స్మగ్లింగ్ చేస్తున్న నలుగురు సభ్యులను విజయవాడలో కస్టమ్స్ అధికారులు బుధవారంనాడు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 12 కిలోలకు పైగా బంగారాన్ని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ బంగారం విలువ రూ.జ 7.48 కోట్లుగా ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు.
గతంలో కూడ ఏపీ రాష్ట్రంలో కస్టమ్స్ అధికారులకు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన ఘటనలు నమోదైన విషయం తెలిసిందే. 2022 అక్టోబర్ 20వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున బంగారాన్ని సీజ్ చేశారు. 13.89 కిలోల బంగారంతో పాటు .రూ.6.7 కోట్ల నగదును కూడా సీజ్ చేశారు. అక్రమంగా బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వారిలో నలుగురిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
2014లో విజయవాడలో కస్టమ్స్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయం ఏర్పాటు చేసిన తర్వాత ఇంత మొత్తంలో బంగారం సీజ్ చేయడం ఇదే ప్రథమంగా అధికారులు చెబుతున్నారు.