ప్రజంలందరు టీడీపీతో ఉన్నారనుకుంటే మందస్తు ఎన్నికలకు వెళ్లాలి. కాపు జాతి పై చంద్రబాబు వైకరిలో మార్పు రావాలి. కాపుల పై గౌతమ్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తున్నాం.

ప్ర‌జ‌లంద‌రు టీడీపీకి మ‌ద్ద‌తు ప‌లికార‌ని చంద్ర‌బాబు భావిస్తే.. ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం డిమాండ్ చేశారు. సోమ‌వారం ముద్ర‌గ‌డ‌ మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర‌బాబు పై ధ్వ‌జ‌మెత్తారు. కాపులు అమ్ముడుపోయార‌ని చంద్ర‌బాబు అన‌డం పై మండిప‌డ్డారు. 


"2004-2014 మ‌ధ్య‌ టీడీపీ ఎన్ని సార్లు ఓడిపోయిందో గుర్తుందా చంద్ర‌బాబు" అని కాపు నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం ప్ర‌శ్నించారు. కేవ‌లం రెండు ఎన్నిక‌ల్లో టీడీపీ గెలవ‌గానే చంద్ర‌బాబు డ‌బ్బా కొట్టుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు.
కాపుల‌కిచ్చిన‌ హామీపై నాన్చుడు ధోర‌ణి వదిలేసి వెంటనే అమలు చేయాలని ముద్ర‌గ‌డ డిమాండ్ చేశారు. కాపులు అమ్ముడుపోయారంటూ చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని... మా జాతిని ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు స‌రికాద‌ని సూచించారు. "మా ఇళ్లకు వచ్చి ఓట్లను అడుక్కున్న ముఖ్యమంత్రి... ఆ తర్వాత మమ్మల్ని బూట్లతో తన్నించార"ని మండిపడ్డారు. త‌మ జాతిని చంద్ర‌బాబు అవ‌మానిస్తున్నార‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు ఉద్యమానికి తాము పనికిరామని భావిస్తే... టీడీపీలో ఉన్న కాపు నేతలతో రాజీనామా చేయించాల‌ని డిమాండ్ చేశారు.

తమ నాయకుడు వంగవీటీ మోహనరంగాపై గౌతంరెడ్డి చేసిన‌ వ్యాఖ్య‌ల‌ను కాపులంద‌రు తీవ్రంగా ఖండిస్తున్నామ‌న్నారు. గౌత‌మ్ రెడ్డి లాగా ఎవ‌రైనా కాపు జాతిపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తే సంహించేది లేద‌ని హెచ్చ‌రించారు. 

మరిన్ని తాజా వార్తా కోసం కింద క్లిక్ చేయండి

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి