Asianet News TeluguAsianet News Telugu

పొలంలో కాడెద్దులై బాలికలు పొలం దున్నుతూ... వెనక తల్లి...

లాక్ డౌన్ పుణ్యమాని చేతిలో చిల్లిగవ్వ లేదు. దీనితో పొలం దున్నడానికి తన కూతుర్ల సహాయం తీసుకున్నాడు.  ఎద్దులనో, ట్రాక్టర్లతోనో పొలాన్ని దున్నుతుంటాము. కానీ డబ్బు లేకపోవడంతో తన కూతుర్ల సహాయంతోనే పొలాన్ని దున్నేసాడు నాగేశ్వర్ రావు. 

girls plough agricultural land to help family due to lack of money during coronavirus pandemic
Author
Madanapalle, First Published Jul 26, 2020, 10:30 AM IST

కరోనా వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఆర్థికంగా కూడా దేశంలో క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు పనులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. చిరు వ్యాపారులు వ్యాపారం సాగక తమ దుకాణాలను మూసివేయాల్సిన పరిస్థితి. 

ఇలానే టీ అమ్ముకునే ఒక దుకాణదారుడు... దుకాణం అద్దె కట్టలేక మదనపల్లి నుండి తన సొంత ఊరికి వెళ్ళాడు. భార్య ఇద్దరు కూతుర్ల సహాయంతో ఉన్న రెండెకరాల పొలాన్ని సాగు చేసుకుందామని నిశ్చయించుకున్నాడు. 

అప్పటికే లాక్ డౌన్ పుణ్యమాని చేతిలో చిల్లిగవ్వ లేదు. దీనితో పొలం దున్నడానికి తన కూతుర్ల సహాయం తీసుకున్నాడు.  ఎద్దులనో, ట్రాక్టర్లతోనో పొలాన్ని దున్నుతుంటాము. కానీ డబ్బు లేకపోవడంతో తన కూతుర్ల సహాయంతోనే పొలాన్ని దున్నేసాడు నాగేశ్వర్ రావు. 

నాగేశ్వర్ రావు ఇద్దరు కూతుర్లు కూడా టీన్ చిన్న పిల్లలే. పెద్ద కూతురు ఇంటర్ చదువుతుండగా, చిన్న కూతురు టెన్త్ పాస్ అయింది. నాగేశ్వర్ రావు భార్య లలిత మాట్లాడుతూ.... ఈ సారి వర్షాలు బాగున్నాయని, తన భర్తకు తమ కుటుంబమంతా సహాయం చేసి ఈ పొలంలో పంట పండించుకోవడం తప్ప వేరే అవకాశం తమకు లేదని అన్నారు. 

వర్షాలు బాగుండడం వల్ల పంట బాగానే పండుతుందని ఆశిస్తున్నట్టు ఆ కుటుంబం తెలిపింది. ఉన్న రెండున్నర ఎకరాల్లో వేరుశెనగ, రాగులు సాగు చేసినట్టు చెప్పారు. 

ఇకపోతే.... లాక్​డౌన్ కారణంగా ఆర్థికంగా ఎంతలా నష్టపోయామో తెలుసుకోవాలంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దేశంలోని ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు 67 శాతం తగ్గాయని రియల్టీ విశ్లేషణ సంస్థ ప్రాప్-ఈక్విటీ నివేదికలో తెలిపింది. 

ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య 9 నగరాల్లో కేవలం 21,294 గృహాలు విక్రయం అయ్యాయని ప్రాప్-ఈక్విటీ సంస్థ ప్రకటించిన నివేదిక తెలిపింది. 2019 ఇదే సమయంలో 64,378 ఇళ్లు, ఫ్లాట్లు అమ్ముడు పోయాయి.

ప్రముఖ రియల్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ ఇటీవల విడుదల చేసిన ఓ సర్వేలో దేశవ్యాప్తంగా 7 ప్రధాన నగరాల్లో 2020 ఏప్రిల్-జూన్​ మధ్య ఇళ్ల అమ్మకాలు ఏకంగా 81 శాతం తగ్గినట్లు తెలిసింది. గడిచిన మూడు నెలల్లో ఏడు నగరాల్లో 12,740 యూనిట్లు మాత్రమే విక్రయం అయ్యాయని అనరాక్​ వెల్లడించింది. 

నోయిడా మినహా మిగతా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు భారీగా తగ్గాయి. గరుగ్రామ్​లో గృహ అమ్మకాలు అత్యధికంగా 79 శాతం తగ్గాయి. గుర్ గ్రామ్ పరిధిలో మూడు నెలల్లో 361 యూనిట్లు మాత్రమే విక్రయమయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో ఇక్కడ 1,707 ఇళ్లు అమ్ముడయ్యాయి.

Follow Us:
Download App:
  • android
  • ios