గుంటూరు: ప్రేమించిన వాడు పెళ్లికి మాత్రం నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. రాజుపాలెం మండలం చల్లపల్లి తండాకు చెందిన శివ నాయక్ కానిస్టేబుల్. ఇతడు గత రెండేళ్ళుగా సాలీబాయి అనే యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే పెళ్ళికి మాత్రం శివనాయకు అంగీకరించకపోవడంతో మోసపోయానని గ్రహించిన సాలిబాయి ఇటీవలే ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

వీడియో

"

అయితే ఆమెనే కుటుంబసభ్యులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. దీంతో కొద్దిరోజులు ఆస్పత్రిలో చికిత్సపొందిన యువతి తాజాగా అనారోగ్యంతోనే ప్రియుడి ఇంటిముందు ధర్నాకు దిగింది. తనకు న్యాయం జరిగేవరకు ఈ నిరసనను కొనసాగిస్తానని... ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని బాధిత యువతి కోరుతోంది.