గుంటూరు నగరంలో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో ఓ యువతిని వంచించి, అనంతరం ఆమెను దారుణంగా హత్య చేశాడో యువకుడు. ఒరిస్సాకు చెందిన మమతా శెట్టి అనే యువతిని నగరానికి చెందిన దివాకర్ అనే యువకుడు నమ్మించి మోసం చేశాడు.

తనను పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయడంతో దివాకర్‌ ఆమెను అత్యంత దారుణంగా హతమార్చి పరారయ్యాడు. మృతురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదుతో ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

రంగంలోకి దిగిన పోలీసులు శ్మశానంలో మమత అస్థికలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. నిందితుడి కోసం పలు బృందాలను ఏర్పాటు చేసి దివాకర్ కోసం గాలిస్తున్నారు. అలాగే ఈ కేసులో నిందితుడికి సహకరించిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.