ప్రేమ విఫలం: తల్లి వారిస్తుండగానే భవనంపై నుంచి దూకి ఆత్మహత్య

Girl commits suicide due to love failure
Highlights

 ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురై ఓ యువతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

విజయవాడ: ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురై ఓ యువతి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన విజయవాడలోని వాంబే కాలనీలో శుక్రవారంనాడు చోటు చేసుకుంది. 

వాంబే కాలనీలో ని హెచ్ బ్లాక్ లో నివాసం ఉంటున్న పోతిరెడ్డి రజని (19) విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేస్తోంది. ఈ నెల 16వ తేదీన ఆస్పత్రికి వెళ్లిన రజని తిరిగి ఇంటికి రాలేదు. దాంతో ఆమె బంధువులు 17వ తేదీన నున్న రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

అయితే రజని తాను పనిచేస్తున్న ఆస్పత్రిలోని రూమ్ బాయ్ అనే యువకుడిని ప్రేమించింది. తాను ప్రేమించిన తుళ్లూరులోని పెదపురిమికి చెందిన ఓనమా గోపీ (20)ని తీసుకుని హైదరాబాద్ వెళ్లింది. ఈ నెల 17వ తేదీన ఆ యువకుడితో కలిసి పోలీసు స్టేషన్ కు వ్చిచంది. 

గోపీని తాను ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని రజని చెప్పింది. దాంతో పోలీసులు ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలను పిలిపించారు. గోపీకి పెళ్లి వయస్సు సరిపోదని ఇరు కుటుంబాల పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో రజని, గోపి ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లారు. 

మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో తల్లి ఇంట్లో ఉండగానే బయట రజని బయట గడియ పెట్టింది. ఆ తర్వాత భవనంపైకి వ్చిచంది. ఇంట్లోంచి తల్లి వారిస్తున్నా వినకుండా భవనంపై నుంచి దూకేసింది. తీవ్రంగా గాయపడిన రజనిని ఆస్పత్రికి తరలించారు .ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. 

loader