Asianet News TeluguAsianet News Telugu

పోలీసులనే ఎదిరించి... నడిరోడ్డుపై పడుకుని యువతి హల్చల్

నడిరోడ్డుపై తమతో వాగ్వాదానికి దిగిన యువతిని పోలీసులు అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నించమే కాదు కేసు నమోదు చేశారు. 

Girl argues with police... police case filed akp
Author
Visakhapatnam, First Published Jun 6, 2021, 8:02 AM IST

విశాఖపట్నం: కర్ప్యూ సమయంలో తిరగడానికి తనకు అన్ని అనుమతులు వున్నా అడ్డుకుంటున్నారంటూ ఓ యువతి పోలీసులతో వాగ్వాదానికి దిగింది. నడిరోడ్డుపై యువతికి పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు అదుపులోకి తీసుకోడానికి ప్రయత్నించగా యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆమెపై కేసు నమోదయ్యింది. ఈ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... విశాఖపట్నంలోని ఓ అపోలో ఫార్మసీలో అపర్ణ అనే మహిళ పనిచేస్తోంది. అత్యవసర సర్వీస్ కావడంతో ఆమె కర్ప్యూ సమయంలో విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి బయలుదేరింది. ఆమె రోడ్డుపై వెళుతుండగా ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఫైన్ వేశాడు. దీంతో పోలీస్ అధికారులు అపర్ణ వాగ్వాదానికి దిగింది. తనకు అన్ని అనుమతులు వున్నా ఎలా ఫైన్ వేస్తారంటూ నిలదీసింది. 

read more  ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు, మరణాలు: కొత్తగా 10,373 మందికి పాజిటివ్, తూ.గోలో అత్యధికం

ఈ క్రమంలో పోలీసులకు, యువతికి మధ్య వాగ్వాదం కాస్తా తోపులాటకు దారితీసింది. ఆమె వద్ద గల ద్విచక్ర వాహనాన్ని స్వాదీనం చేసుకోడానికి ప్రయత్నించగా యువతి అడ్డుకుంది. దీంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకోడానికి పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలో మహిళా పోలీసులు, యువతికి మద్య తోపులాట చోటుచేసుకుంది. తాను తప్పు చేయనప్పుడు ఎందుకు రావాలంటూ ఆమె నేలపై పడుకుని నిరసనకు దిగింది. స్టేషన్‌కు రానని యువతి తేల్చిచెప్పడంతో చివరకు పోలీసులు వెనుదిరిగారు. 

అయితే పోలీసుల విధులకు ఆటంకం కలిగించిందన్న ఆరోపణలపై అపర్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. అపర్ణతో పాటు ఆమె స్నేహితుడు రాజ్ కుమార్ పై సెక్షన్ 352, 353 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు  తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios