అమరావతి: వెంగయ్య మృతికి తానే కారణమని నిరూపిస్తే  ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పష్టం చేశారు.

ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. శవ రాజకీయాలు చేయడాన్ని జనసేన మానుకోవాలని ఆయన కోరారు. వెంగయ్యతో తనకు ఎలాంటి వివాదం లేదన్నారు. వెంగయ్యతో వివాదాన్ని ఎడిటింగ్ చేసి  చూపిస్తున్నారని ఆయన ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ ఎంతమందితో యుద్ధం చేశారు, ఎంత మందిని ప్రశ్నించారో చెప్పాలన్నారు.ఇద్దరం పోటీ చేద్దాం, పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏ శిక్షకైనా తాను సిద్దమని చెప్పారు. ఒకవేళ ఆయన ఓటమి పాలైతే జనసేనను మూసివేస్తారా అని ఆయన ఎమ్మెల్యే రాంబాబు ప్రశ్నించారు.

వెంగయ్య మృతి విషయమై ప్రకాశం జిల్లా ఎస్పీకి పవన్ కళ్యాణ్ శనివారం నాడు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే  రాంబాబుతో వివాదం కారణం తర్వాతే  వెంగయ్య మరణిించినట్టుగా జనసేన ఆరోపిస్తోంది. ఈ విషయమై జిల్లాలోని జనసేన కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యాడు. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎస్పీ సిద్దార్ధ్ కౌశల్ తో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. వెంగయ్య మృతికి కారకులపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు.నిన్న పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై ఇవాళ ఎమ్మెల్యే అన్నా రాంబాబు స్పందించారు.