విశాఖపట్టణం: ఉత్తరాంధ్ర పేరు చేబితే చాలు టక్కున గుర్తుకు వస్తారు... ఏ పార్టీ అధికారంలో ఉన్న మంత్రిగా  ఉండటం ఆయన స్టైల్ .. తనోక్కడేకాకుండా .. తనను నమ్ముకున్న వారిని సైతం గెలుపు బాట పట్టించగల ఏఏకైక నాయకుడు ... ఆయనే ప్రకాశం జిల్లానుండి వచ్చి విశాఖ జిల్లాలో తిరుగులేని రాజకీయనేతగా ఎదిగిన మంత్రి గంటా శ్రీనివాస్. ఏం చేసినా వార్తల్లో ఉండే గంటా శ్రీనివాస్ తన రాజకీయ మకాం మార్చేస్తున్నారంటూ మళ్లీ వార్తల్లొకెక్కారు. 2019 ఎన్నికల్లో గంటా విశాఖను విడిచిపెట్టనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారాన్ని సన్నిహితులు సైతం అవుననే అంటున్నారు. ఇంతకీ మంత్రి గంటా ఎక్కడ పాగా వేయనున్నారు. రాజీకీయ జీవితాన్ని ప్రసాదించిన జిల్లాను వదిలి ఏ జిల్లాకు పయనమవుతారు. అసలు గంటా పొలిటికల్ ప్లాన్ ఏంటి... 
 
ఉత్తరాంధ్రలో టీడిపి కీలక నేత మంత్రి గంటా శ్రీనివాస్. విశాఖ జిల్లా కేంద్రంగా రాజకీయాలు చేసిన ఆయన జిల్లా మారనున్నారనే వార్తలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ప్రతి ఎన్నికల్లో ఏదో ఒక కొత్త నియోజకవర్గం నుంచి పోటీ చేసే అలవాటు ఉన్న గంటా శ్రీనివాస్ తన రాజకీయ అడ్డాను మరో ప్రాంతానికి మార్చాలనే ఆలోచనలో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రి గంటా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలీ నియోజకవర్గం ఆయనకు నాలుగవది. మొదటిసారిగా అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేసి గెలిచారు ఆ తర్వాత చోడవరం అసెంబ్లీ నుండి గెలిచారు. మూడోసారి అనకాపల్లి అసెంబ్లీ నుండి విజయం సాధించారు. 2014లో భీమిలీ నుంచి పోటీ చేసి గెలుపొంది మంత్రిగా కొనసాగుతున్నారు. అయితే ఈ సారి విజయనగరం జిల్లాలోని నెల్లి మర్ల నుండి పోటీ చేయడానికి సిద్దమవుతున్నారని ప్రచారం జరుగుతోంది.   

విశాఖపట్టణంలో వరుస వివాదాల్లో ఇరుక్కుంటుండంతో జిల్లాను వదిలి వెళ్లాలని అనుకుంటున్నారట. భూవివిధాలు , ఆస్థులను బ్యాంక్ వేలం పాట వేస్తామని ప్రకటించడం వంటి ప్రచారం గంటా ఇమేజ్ ను డామేజ్ చేస్తున్నాయట. ఇకపోతే భీమిలి ప్రజలు కూడా గంటాపై అసంతృప్తితో ఉన్నారని ప్రచారం. తెలుగుదేశం ప్రభుత్వం సైతం చేసుకున్న సర్వేలో భీమిలి నియోజక వర్గంలో గంటా ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారని తేల్చడంతో గంటా ముందస్తూ వ్యూహంగా తన రాజకీయ మకాంను విజయనగరం జిల్లాకు మార్చెయ్యలని ప్లాన్ చేస్తున్నారట. 


అంతేకాకుండా విశాఖపట్టణం నుంచి రాష్ట్ర కేబినేట్ లో మరో మంత్రిగా పని చేస్తున్న చింతకాయల  అయన్నపాత్రుడికి గంటాకు మధ్య పచ్చగడ్డి వేస్తేనే భగ్గుమనే పరిస్థితి. అవకాశం అంది వచ్చినప్పుడల్లా  గంటా పై అస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు మంత్రి అయ్యన్నపాత్రుడు.  ఇది గంటాకు పెద్ద తలనొప్పిగా మారింది. స్వయంగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని రాజీ చేసినా ఇద్దరిలో మార్పు రాలేదు. మరోవైపు గంటా శ్రీనివాస్ కు అత్యంత సన్నిహితుడు అయిన ఎంపీ అవంతి శ్రీనివాస్ కూడా అంటీ ముట్టనట్లు ఉంటున్నారని ఇద్దరి మధ్య పొసగడం లేదని టాక్. వీటినుండి బయట పడేందుకు, తన పదవిని సేఫ్ గా ఉంచుకునేందుకు గంటా విజయనగరం జిల్లా నెల్లిమర్ల వైపు చూస్తునన్నారని సమాచారం. 

నెల్లి మర్లలో ప్రస్తుతం ఉన్న టిడిపి సీనియర్ ఏమ్మెల్యే పతివాడ నారాయణ స్వామికి వయస్సు దృష్ట్యా వచ్చే ఏన్నికల్లో  టిక్కట్ ఇచ్చే అవకాశాలులేవు. ఇక అతని కుమారుడుకి సైతం షాడో ఏమ్మెల్యేగా ముద్ర పడటంతో  అతనికి కూడా టిడిపి టిక్కేట్ డౌటే. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని గంటా నెల్లిమర్లలో పాగా వేయ్యాలన్నది ప్లాన్ గా ఉందని  టీడిపి శ్రేణులు భావిస్తున్నారు. 

ఎన్నికల సమయంలో ఒక్కసారిగా తెరమీదకి వస్తే  కొంత ఇబ్బందులు తప్పవని గ్రహించిన మంత్రి గంటా పక్కా ప్లాన్ తో కడప ఇంచార్జ్ మంతిగా ఉన్న తనని  విజయనగం జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా చంద్రబాబుతో లాబీయింగ్ చేయించుకుని మరీ వేయిచుకున్నారు అంటున్నారు. జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా  వచ్చినప్పటి నుంచి జిల్లా పై పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒక్కో ఎమ్మెల్యేని తనవైపుక తిప్పుకుంటూ పావులు కదుపుతున్నారు.


 ఒకానోక సందర్భంలో మాజీ కేంద్రమంత్రి  టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు సైతం గంటా వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేశారని సమాచారం. దాంతో కొంత దూకుడు తగ్గించిన గంటా తెరవెనుక మాత్రం తన పనులు  తాను చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఎప్పుడూ గ్రామీణ ప్రాంతాల ఓటర్లు ఉండే ప్రాంతాలవైపే మెుగ్గు చూపే గంటా..  ఈసారి నెల్లిమర్ల పై దృష్టి పెట్టి నియోజకవర్గంలోని వివిధ సంఘాల నేతలు, జిల్లాలో ని ముఖ్యవ్యక్తులతో ప్రత్యేకంగా సమావేసమవుతూ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారంట. 


తనకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన విశాఖ జిల్లాను వదిలి విజయనగరంకి గంటా శ్రీనివాస్ వస్తారో లేక  విశాఖ జిల్లాలోనే మరే నియోజకవర్గం నుంచైనా పోటీ చేస్తారో అన్నది వేచి చూడాలి. మరోవైపు గంటా తనయుడు సైతం రాజకీయాలపట్ల ఆసక్తి చూపుతున్నారని తనని భీమిలి నియోజకవర్గం నుంచి బరిలోకి దింపి గంటా నెల్లిమర్ల నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం లేకపోలేదు. మరి వీటన్నింటి చిక్కుముడి వీడాలంటే కొద్దిరోజుల వేచి చూడాల్సిందే.