విశాఖపట్నం: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) శాసన సభ్యుడు గంటా శ్రీనివాస రావు ఆస్తుల వేలానికి ఇండియన్ బ్యాంక్ రంగం సిద్ధం చేసింది. ఆయన ఆస్తులతో పాటు ప్రత్యూష సంస్థకు చెందిన ఏడుగురు డైరెక్టర్ల ఆస్తులను కూడా బ్యాంక్ వేలం వేయనుంది. ఏప్రిల్ 16వ తేదీన ఆస్తులను వేలం వేయాలని నిర్ణయించింది.

అందుకు గాను ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. పన్నుఎగవేత వ్యవహారంలో గంటాతో పాటు ప్రత్యూష సంస్థ డైరెక్టర్ల ఆస్తులను బ్యాంక్ ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. గంటా శ్రీనివాస రావుకు చెందిన బాలయ్య శాస్త్రి లే అవుట్ లోని ప్లాట్ ను వేలం వేయడానికి నిర్ణయించింది.

Also Read: మంత్రి గంటాకు షాక్: ఆస్తుల వేలానికి రంగం సిద్ధం, వేలంలో ఇల్లు కూడా...

గంటా శ్రీనివాస రావుకు చెందిన ప్రత్యూష సంస్థ 141.68 కోట్ల రుణం తీసుకుంది. అసలు, వడ్డీతో కలిపి అది 200.66 కోట్లకు చేరుకుంది. ఈ మొత్తాన్ని కూడా ప్రత్యూష సంస్థ ఎగవేసింది. ఈ నేపథ్యంలో ఆస్తులను వేలం వేయడానికి ఇండియన్ బ్యాంక్ సిద్ధపడింది.