రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్‌పై గంభీర్ రియాక్షన్ ఇదే
Gautam Gambhir reaction on Virat Kohli and Rohit Sharma retirement: దిగ్గజ క్రికెట్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించారు. కోహ్లీ, రోహిత్ మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.
భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం తన సతీమణితో కలిసి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారాయన. అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడారు. టీ20 వరల్డ్ కప్‌ను భారత్ గెలుచుకోవడంపై ఆనందం వ్యక్తం చేశారు. భారత్ గర్వించేలా టీమిండియా టీ20 ప్రపంచ కప్‌ను గెలిచిందని చెప్పారు.
అలాగే, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు గంభీర్ అభినందనలు తెలిపారు. మరోవైపు కోహ్లీ, రోహిత్‌ల రిటైర్మెంట్ ప్రకటనపైనా గంభీర్ స్పందించారు. వారిద్దరూ రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే మంచి సమయమన్నారు. టీ20 ప్రపంచ కప్ గెలవడం కంటే మంచి సందర్భం మరేం ఉంటుందన్నారు. ఇకపై వన్‌డే, టెస్ట్ క్రికెట్‌లో భారత్‌కు వారిద్దరూ విలువైన సేవలందిస్తారన్నారు.
కాగా, టీ20 ప్రపంచ కప్‌లో భారత్ చరిత్రాత్మక విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రాహుల్ ద్రవిడ్‌లకు ఫోన్ చేశారు. రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్సీకి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ఆఖరి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ తమ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు.
అలాగే, టీ20 ఫైనల్ మ్యాచ్ ఆఖరి ఓవర్‌లో హార్దిక పాండ్యా బౌలింగ్‌లో డేవిడ్ మిల్లర్‌ను అవుట్ చేయడాన్ని, బౌండరీ లైన్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ పట్టడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు.