అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బోరుబావిలో నుంచి గ్యాస్, అగ్ని కీలలు ఎగసిపడుతుండటం కలకలం రేపుతోంది. రాజోలు మండలం శివకోటిలో ఆక్వాచెరువు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది.

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో బోరుబావిలో నుంచి గ్యాస్, అగ్ని కీలలు ఎగసిపడుతుండటం కలకలం రేపుతోంది. రాజోలు మండలం శివకోటిలో ఆక్వాచెరువు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. బోరు బావిలో నుంచి గ్యాస్ లీకేజ్‌తో మంటలు ఉధృతంగా ఎగిపడుతున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఓఎన్‌జీసీ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది.. మంటలను ఎలా అదుపులోకి తీసుకురావాలనే దానిపై సమాలోచలు జరుపుతున్నారు. మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

అయితే ఈ ఘటన ఓఎన్‌జీసీ పైప్ లైన్‌కు సంబంధించిందినది కాదని.. ఆ ప్రాంతంలో గ్యాస్ నిక్షేపాలు ఉండటంతో బోరుబావిలో నుంచి గ్యాస్ నిక్షేపాలు బయటకు వెలువడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.