జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు పొగడ్తల వర్షం కురిపించారు. ఇటీవల పవన్ చేసిన ఓ వ్యాఖ్యలు ఆయనకు బాగా నచ్చాయట.. ఈ నేపథ్యంలో.. పవన్ పై ప్రశంసల జల్లు కురిపించారు.

ఇంతకీ మ్యాటరేంటంటే.. పవన్ ప్రస్తుతం ప్రజాపోరాట యాత్రలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ యాత్రలో భాగంగా కొందరు ముస్లింలు.. మీరు బీజేపీని సమర్థిస్తున్నారా..? వ్యతిరేకిస్తున్నారా..? అని పవన్ ని ప్రశ్నించారు.

కాగా.. దానికి సమాధానంగా పవన్.. ఇచ్చిన సమాధానం గరికబాటికి బాగా నచ్చిందట. ఆ వార్త పేపర్లో చదివినప్పుడు తనకు చాలా సంతోషం వేసిందన్నారు.

బీజేపీని హిందూ పార్టీగా ఎందుకు చూస్తారని.. అదొక రాజకీయ పార్టీ అని.. ఈ రోజుల్లో గిరిగీసుకుని కూర్చోకూడదంటూ పవన్ చెప్పిన సమాధానం తనకు ఎంతో నచ్చిందన్నారు. విలీనం చేస్తే తప్పు కానీ.. సమర్థిస్తే తప్పుకాదన్నారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలున్నప్పుడు ఏదో ఒక పార్టీతో కలిసి పనిచేయక తప్పదని పవన్ చేసిన వ్యాఖ్యలు అతడి రాజకీయ పరిపక్వతతను తెలియచేస్తున్నాయన్నారు.

 ఆ వ్యాఖ్యకు జోహార్ అన్నారు గరికపాటి. ఇలా అంటున్నానని తను పవన్ పార్టీని సమర్థిస్తున్నానని కానీ.. వ్యతిరేకిస్తున్నానని కానీ అర్థం కాదన్నారు. ఆ అవసరం తనకు లేదన్నారు. దీనికి ఎలాంటి తప్పుడు వ్యాఖ్యానాలు చేయకూడదని విన్నవించుకున్నారు.