మంత్రి గంటా మాతో టచ్‌లో ఉన్నారు: విజయసాయి రెడ్డి

First Published 23, May 2018, 3:17 PM IST
ganta srinivasa rao consulting us join ysrcp says vijayasai reddy
Highlights

మంత్రి గంటా మాతో టచ్‌లో ఉన్నారు: విజయసాయి రెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గోడ మీద పిల్లి లాంటి వారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి అన్నారు.  ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనుకుంటే ఆయన అక్కడ చేరిపోతారని చెప్పారు. డబ్బే ప్రధానమని, నీతి నియమాలు లేని గంటా కనీసం విమర్శించేందుకు కూడా అర్హుడు కారని అన్నారు. గతంలో ఎన్నో పార్టీలు మారిన గంటా ఇప్పుడు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి మారడానికి సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నష్ట జాతకుడని, ఆయన అధర్మ పోరాటం చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయాలన్ని అపవిత్రం చేశారని మండిపడ్డారు. 

loader