తనపై టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. చంద్రబాబును చూసి ఆ పార్టీ నాయకులంతా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. మంగమ్మ శపథాలు చేస్తున్నారంటూ వంశీ తీవ్రవ్యాఖ్యలు చేశారు.
తనపై టీడీపీ సీనియర్ నేత చింతమనేని ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు మరో పార్టీలోకి వెళ్లిన టీడీపీ వెంటిలేటర్ మీద వుందా..? లేక 150 మంది శాసనసభ్యుల బలం వున్న పార్టీ వెంటిలేటర్ పైన వుందో చెప్పాలన్నారు. చంద్రబాబును చూసి ఆ పార్టీ నాయకులంతా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని.. మంగమ్మ శపథాలు చేస్తున్నారంటూ వంశీ తీవ్రవ్యాఖ్యలు చేశారు. గన్నవరంలో చంద్రబాబు, లోకేష్‌లను పోటీ చేయాల్సిందిగా తాను చాలా సార్లు చెప్పిన విషయాన్ని వల్లభనేని గుర్తుచేశారు.
ఇదిలావుండగా.. గన్నవరంలో జరిగిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్నవరం అసెంబ్లీలో వచ్చే ఎన్నికల్లో డబ్బున్నవాడిని కాదు దమ్మునోడిని నిలుపుతామన్నారు. గన్నవరంలో రూ. 150 కోట్లు ఖర్చు పెడతానని ఓ వ్యక్తి తన వద్దకు వచ్చారని కూడా చింతమనేని వ్యాఖ్యానించారు. పార్టీలో వున్నవారు వెళ్తారని.. కొత్తవారు వస్తుంటారని వల్లభనేని వంశీని ఉద్దేశిస్తూ చింతమనేని కామెంట్ చేశారు.
Also REad: రూ. 150 కోట్ల ఖర్చుకు రెడీ, గన్నవరంలో దమ్మునోడే నిలుపుతాం: చింతమనేని సంచలనం
ఇకపోతే.. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని గన్నవరం, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాలపై టీడీపీ దృష్టి కేంద్రీకరించింది. 2014, 2019 ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా వల్లభనేని వంశీ పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వల్లభనేని వంశీ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి జై కొట్టారు. నాటి నుంచి టీడీపీ చీఫ్ చంద్రబాబు, నారా లోకేష్‌లపై వల్లభనేని వంశీ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీంతో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరంలో వల్లభనేని వంశీని ఓడించాలని టీడీపీ పట్టుదలగా ఉంది. ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంచార్జీగా ఉన్న బచ్చుల అర్జునుడు ఇటీవల అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. దీంతో ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో కొత్త ఇంచార్జీ కోసం టీడీపీ నాయకత్వం అన్వేషణ ప్రారంభించింది.
