ఓ వివాహితపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశారు. పనుల మీద భర్త వేరే ఊరికి వెళ్లిన సమయంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గుంటూరు : గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో మహిళపై molestation జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. బుధవారం మధ్యాహ్నం వీరంకి లక్ష్మీ తిరుపతమ్మ (40) అనే married woman అనుమానాస్పదస్థితిలో మృతిచెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. మొదట Suspicious deathగా భావించిన పోలీసులు.. మృతదేహంపై గాయాలను బట్టి Gang rape జరిగిందని నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించిన ఆధారాలను క్లూస్ టీం సేకరిస్తుంది. ఈ సంఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో తిరుపతమ్మ బంధువైన ఓ వ్యక్తి ఆమెను కలవడానికి ఇంటికి వెళ్ళాడు. అప్పటికే ఆమె ఒంటిపై దుస్తులు సక్రమంగా లేకుండా.. అచేతనంగా పడి ఉండడం గమనించి పోలీసులు,108 సిబ్బందికి సమాచారం అందించాడు. ఆమె ఒంటిమీద గోర్లు, పండ్ల గాట్లు ఉన్నాయి. ఆ గదిలో మద్యం తాగినట్టుగా బాటిల్స్ కూడా లభించాయి. దీంతో ఆమె మీద సామూహిక అత్యాచారం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
తిరుపతమ్మకు పదిహేనేళ్ల కిందట శ్రీనివాసరావు అనే వ్యక్తితో వివాహం అయింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. పొలాలకు నీళ్లు పెట్టే ట్యూబ్ లు అద్దెకు ఇస్తూ జీవనం సాగిస్తున్నారు. శ్రీనివాసరావు పనుల కోసం గ్రామం విడిచి వెళుతుంటాడు. అలా ఒకసారి పెడితే ఐదు ఆరు నెలల పాటు ఇంటికి తిరిగి రాడు.
గతేడాది డిసెంబర్ లో ఆయన పనుల కోసం ఇంటి నుంచి వెళ్లాడు. ఇంకా తిరిగి రాలేదు. అయితే, తిరుపతమ్మ ఇంటి తలుపులు తెరచి ఉండడం… ఆమె చెవి రింగులు పక్కనే పడిపోవడం, గొంతుపై గట్టిగా నులిమినట్లు గుర్తులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలి భర్తను ఫోన్ ద్వారా సంప్రదించగా ఆయన రైల్వేశాఖలో ఎలక్ట్రికల్ పనుల కోసం వెళ్లానని, ప్రస్తుతం తిరుపతిలో ఉన్నట్లు చెప్పాడు. వెంటనే గ్రామానికి బయల్దేరి వస్తున్నానని, మృతిపై అనుమానాలు ఉన్నాయని అన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. శవపరీక్షల కోసం మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా, గుప్తనిధుల కోసం కూతురిమీదే అత్యాచారం చేసి, బలి ఇవ్వడానికి తెగబడిన ఓ తండ్రి ఉదంతం మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలో వెలుగుచూసింది. గుప్తనిధుల కోసం 18 ఏళ్ల కుమార్తెనే బలిచ్చేందుకు సిద్ధమయ్యాడో తండ్రి. బాలిక సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బాలిక తండ్రి, తాంత్రికుడితో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేశారు. బాబుల్గావూన్ తహసీల్ లోని మద్ని గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతురు బంధువుల ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటుంది. ఇటీవలే తన సొంత ఊరికి వచ్చింది. ఈ క్రమంలో తండ్రి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఆ తర్వాత తాంత్రికుడితో కలిసి ఇంట్లో క్షుద్రపూజలు చేయడం ప్రారంభించాడు. కుమార్తెను సజీవంగా ఖననం చేసేందుకు ఏప్రిల్ 25న ఇంట్లోనే పెద్ద గొయ్యి కూడా తవ్వాడు. ఈ విషయాన్ని గుర్తించిన బాలిక ఎలాగోలా తన స్నేహితురాలికి సమాచారం చేరవేసింది. ఈ విషయాన్ని స్నేహితురాలు పోలీసులకు తెలియజేసింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికను రక్షించారు. క్షుద్ర పూజలు చేస్తున్న బాలిక తండ్రితోపాటు, తాంత్రికుడు, మరో ఏడుగురిని అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
