గ‌ల్లా ఫ్యామిలీ మాజీ ముఖ్య‌మంత్రి దివంగ‌త నేత రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో కాంగ్రెస్ త‌ర‌పున కీల‌క బాధ్య‌త‌లను పోషించారు. ఆ త‌ర్వాత తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న అనంత‌రం గ‌ల్లా ఫ్యామిలీ చంద్ర‌బాబు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకున్నారు. 

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజ‌కవ‌ర్గం నుంచి గ‌ల్లా అరుణకుమారి పోటీచేశారు. అలాగే ఈమెతో పాటు ఆమె తనయుడు గల్లా జయదేవ్ కూడా గుంటూరు జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేశారు. అయితే అరుణకుమారి త‌న సొంత నియోజ‌కవ‌ర్గంలో ప్ర‌త్య‌ర్థి చెవిరెడ్డి భాస్క‌ర్ రెడ్డిని ఓడించ‌లేక పోయారు. అయితే ఆమె త‌న‌యుడు జ‌య‌దేవ్ మాత్రం గుంటూరులో టీడీపీ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

అరుణ కుమారి 2019 ఎన్నిక‌ల్లో కూడా టీడీపీ త‌ర‌పున చంద్ర‌గిరిలోనే పోటీ చేస్తార‌ని జిల్లా వాసులంద‌రూ అనుకున్నారు. కానీ ఊహించ‌ని ప‌రిణామాల నేప‌థ్యంలో ఆమె టీడీపీ కి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యంతోనే కొన్నాళ్ల కిందట త‌న‌ను చంద్రగిరి ఇన్ చార్జి పదవి నుంచి తప్పించాలని కోరుతూ చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు గల్లా అరుణకుమారి. కానీ చంద్ర‌బాబు నుంచి ఎలాంటి స్పంద‌న రాలేదు. ఇక సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న క్రమంలో ఆమె వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడీ అయ్యార‌ట‌. 

ఒక వేళ జ‌య‌దేవ్ వైసీపీలో చేరితే ఇటు టీడీపీ కంచుకోట బ‌ద్ద‌లు అవ్వ‌డం ఖాయం, అటు గ‌ల్లా అరుణ‌కుమారి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలోకి చేరితే చంద్ర‌బాబు సొంత జిల్లాలో టీడీపీ బీట‌లు వాల‌డం ఖాయం అని విశ్లేష‌కులు అంటున్నారు. చూద్దాం ఇంకా సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ఏడాది స‌య‌మం ఉంది ఈ లోపు వీరిద్ద‌రు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి చేరుతారా అన్న‌ది ఆసక్తిగా మారుతోంది. అయితే వైసీపీలో చేరిక‌పై గల్లా ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.