అన్నవరం: ప్రజా గాయకుడు గద్దర్ శుక్రవారంనాడు అన్నవరం సత్యదేవుడిని దర్శించుకున్నారు. సత్యదేవుడికి ఆయన ప్రత్యేక పూజలు చేశారు. భక్తులతో కలిసి గోవింద నామస్మరణ చేశారు. గుడి ఆవరణలో భక్తీ గీతాలు పాడిన కళాకారులతో గొంతు కలిపారు. 

అక్కడ ఆయన హార్మోనియం కూడా వాయించారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. సత్యదేవుడి దర్శనం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ ఉక్కు ప్రైవెటీకరణ జరగరాదని, ప్రజలకే అది దక్కాలని సత్యదేవుడిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు 

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మికులకు ఆయన మద్దతు ప్రకటించారు. పి. సత్యారెడ్డి నిర్మాణ దర్శకత్వంలో ఉక్కు సత్యాగ్రహం సినిమా వస్తోందని ఆయన చెప్పారు. ఆ సినిమాలో తాను నటించి, పాట పాడుతున్నట్లు గద్దర్ తెలిపారు.