ఫర్నిచర్‌ దొంగ జగన్‌.. మాజీ సీఎంపై టీడీపీ సంచలన ఆరోపణలు

‘‘ఇల్లు కట్టి చూడు-పెళ్ళి చేసి చూడు' అంటుంటారు పెద్దలు. కానీ 'కుర్చీ ఎక్కిచూడు, ఇంటి కిటికీ గట్రాలకు కూడా కోట్లు కొట్టేసి చూడు. చిటికెలో పని' అని చేసి చూపించాడు జగన్’’ అంటూ టీడీపీ ట్వీట్ చేసింది. దీనికి ఏమని రిప్లై ఇచ్చిందో తెలుసా..?

Furniture thief Jagan.. TDP's sensational tweet GVR

ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి చంద్రబాబు ప్రభుత్వం తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించడంతో పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన అధికారులను సాగనంపుతోంది. కొందరు ఉన్నతాధికారులనైతే పొమ్మనలేక పొగబెట్టినట్లు పంపించేశారు. మరికొందరికి చంద్రబాబు అపాయింట్‌మెంట్‌ దక్కలేదు. ఇంకొందరు అధికారులు సీఎం చంద్రబాబు ఛాంబర్‌ వరకు వచ్చాక భంగపాటు తప్పలేదు. ఇలా తొలుత వైసీపీ అనుకూల అధికారులపై దృష్టిపెట్టింది చంద్రబాబు ప్రభుత్వం.

ఆ తర్వాత ప్రభుత్వ శాఖల్లో జరిగిన అవినీతి, తప్పిదాలపై దృష్టిపెట్టింది. మొట్టమొదటగా టీడీపీపై నోరేసుకొని పడిపోయే మాజీ మంత్రి రోజాకు, గత ప్రభుత్వంలో శాప్ ఛైర్మన్‌గా పనిచేసిన బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డిని టార్గెట్‌ చేశారు. రోజాకు ఇది ఊహించని షాక్ అనే చెప్పాలి. వైసీపీ హయాంలో క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన రోజా ఆడుదాం ఆంధ్రా, సీఎం కప్‌ల పేరుతో భారీ అవినీతికి పాల్పడ్డారని రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఐడీకి ఫిర్యాదు చేసింది. ఇదే కేసులో శాప్‌ మాజీ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరు కూడా చేర్చినట్లు తెలుస్తోంది. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీల్లో రూ.100 కోట్ల అక్రమాలలు జరిగాయని.. దానిపై విచారణ చేపట్టాలని ఈ నెల 11న సీఐడీ అదనపు డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు రాష్ట్ర ఆత్యా-పాత్యా సంఘం సీఈవో ఆర్డీ ప్రసాద్‌. వైసీపీ హయాంలో పనిచేసిన శాప్‌ ఎండీలు, ఉన్నతాధికారులు, అన్ని జిల్లాల్లోని డీఎస్‌డీవోలపై విచారణ జరపాలని కోరారు. క్రీడా కోటాలో మెడికల్, ఇంజినీరింగ్, ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలు పొందిన వారిపైన కూడా విచారణ చేపట్టాలని సీఐడీని డిమాండ్ చేశారు.

ఇప్పుడు ఏకంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డినే టార్గెట్‌ చేసింది తెలుగుదేశం పార్టీ. మాజీ ముఖ్యమంత్రి జగన్‌పై సంచలన ట్వీట్‌ చేసింది. 

‘‘లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినా జగన్‌కి ప్రజల సొమ్ము మీద మోజు తీరలేదు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్‌తో నింపేసాడు. పదవి ఊడిపోయాక ఆ ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి కదా! అయినా ఇవ్వలేదు'' అంటూ ఓ ట్వీట్‌... 

 

‘‘ఇల్లు కట్టి చూడు-పెళ్ళి చేసి చూడు' అంటుంటారు పెద్దలు. కానీ 'కుర్చీ ఎక్కిచూడు, ఇంటి కిటికీ గట్రాలకు కూడా కోట్లు కొట్టేసి చూడు. చిటికెలో పని' అని చేసి చూపించాడు జగన్’’ అంటూ మరో ట్వీట్ చేసింది టీడీపీ.

 

 

ఈ ట్వీట్లపై స్పందించిన నెటిజన్లు... ‘‘దొంగే కానీ, మరీ ఇంత చీప్ దొంగ అనుకోలేదు’’, ‘‘ఇంకా ఎన్ని రోజులు, కేస్ పెట్టి లోపల వేయండి రా బాబూ’’ అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. 

 

టీడీపీ ట్వీట్‌కు వైసీపీ కౌంటర్‌... 
“సిగ్గులేకుండా @JaiTDP  చేస్తున్న నీతిమాలిన రాజకీయం బట్టబయలు” 
‘‘వైయస్సార్‌సీపీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో నిన్నటి సమావేశంలో ఫొటోలు పట్టుకుని ప్రేలాపనలు, పైశాచిక పోస్టింగులు. మంత్రులు కూడా తమ స్థాయిని దిగజారి పోస్టింగులు. @ysjagan క్యాంపు కార్యాలయంలో ఫర్నిచర్‌పై తప్పుడు ఆరోపణలు. ప్రభుత్వం నుంచి పొందిన ఫర్నిచర్‌ జాబితాను ఇప్పటికే సమర్పించిన వైయస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయం. ప్రభుత్వ జీవోల ప్రకారం ఈ వస్తువులకు ఉన్న రేట్లను అనుసరించి ఖరీదు కట్టాలని అధికారులను కోరిన వైయస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయం, 9-10 రోజుల క్రితమే ఈ మేరకు అధికారులకు విజ్ఞప్తి చేసిన క్యాంపు కార్యాలయం. వైయస్‌ జగన్‌ క్యాంపు కార్యాలయం కోరిక మేరకు ఫైలు కూడా పెట్టిన అధికారులు. ఆ ఫైలు అధికారిక ప్రక్రియలో ఉంది. ఇదిలా ఉండగానే… ఎంపీలతో నిన్నటి వైయస్ జగన్‌ సమావేశం ఫొటోలను పట్టుకుని వికృత పోస్టింగులు పెడుతున్న టీడీపీ. ఈ దుష్ప్రచారంలో మంత్రులు కూడా భాగస్వామలు కావడం సిగ్గుచేటు’’ అంటూ సమర్థించుకుంది.

 

 

గతంలో 2014-2019 మధ్య కాలంలో అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేసిన కోడెల శివప్రసాద రావుపై వైసీపీ అధికారంలోకి వచ్చాక 2019లో ఇలాంటి ఆరోపణలే చేసింది. అసెంబ్లీ ఫర్నీచర్‌ను తన కుమారుడి షోరూమ్‌కు కోడెల తరలించారని వైసీపీ నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు చేశారు. గుంటూరులోని కోడెల కుమారుడు శివరామ్‌కు చెందిన షోరూమ్‌ నుంచి ఫర్నిచర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అనుకోని విధంగా కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వ వేధింపులే కోడెల బలవన్మరణానికి కారణమని టీడీపీ ఆరోపించింది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios