సారాంశం

హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగుల ఉచిత వసతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు ఉచిత వసతి, ట్రాన్సిట్ వసతి కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది.

హైదరాబాద్ నుంచి అమరావతికి తరలివచ్చిన ఉద్యోగుల ఉచిత వసతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు ఉచిత వసతి, ట్రాన్సిట్ వసతి కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. విజయవాడ, గుంటూరు వేర్వేరు ప్రాంతాల్లో కేటాయించిన వసతిని పొడిగిస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. సచివాలయం, హెచ్‌వోడీ కార్యాలయాలు, హైకోర్టు, రాజ్‌భవన్ ఉద్యోగులకు వసతిని పొడిగిస్తున్నట్టుగా తెలిపింది. ఇక, హైదరాబాద్‌ నుంచి రాజధాని అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని సర్కార్ పలుమార్లు పొడిగించిన సంగతి తెలిసిందే. 

చివరగా  గతేడాది సెప్టెంబర్‌లో హైదరాబాద్‌ నుంచి రాజధాని అమరావతికి తరలివచ్చిన ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయాన్ని 023 జూన్‌ 26 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఆ గడువును 2023 జూన్ నుంచి 2024 జూన్ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.