విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో నకిలీ వైద్యురాలు హల్‌చల్ చేసింది. పీపీఈ కిట్ ధరించి నకిలీ డాక్టర్ రోగుల బంధువుల నుంచి డబ్బులు వసూలు చేస్తుండగా అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను పట్టుకున్నారు. దీంతో ఆమె హాస్పిటల్ వైద్యురాలు కాదని నకిలీ డాక్టర్ అన్న విషయం బయటపడింది. 

కరోనా రోగుల ఆరోగ్య పరిస్థితి చెబుతానంటూ సహాయకులకు వద్ద ఆమె డబ్బు వసూలు చేసింది. డాక్టర్ శైలజ పేరుతో ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లోనూ తిరిగినట్లు సమాచారం. పీపీఈ కిట్ల మాటున ఆమె చేస్తున్న మోసాన్ని గుర్తించిన సెక్యూరిటి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. 

దీంతో వెంటనే రంగలోకి దిగిన పోలీసులు నకిలీ డాక్టర్ తో పాటు ఆమెకు సహకరించిన భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళ ఇలా మోసాలకు పాల్పడటం ఇదేమీ మొదటిసారి కాదని... గతంలోనూ ఈమెపై అనేక కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

read more   కరోనా కట్టడికి జగన్ ప్రభుత్వ కీలక నిర్ణయం...వాట్సాప్ నెంబర్లు ఇవే..

ఇదిలావుంటే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మరణ మృదంగం మోగిస్తోంది. రాష్ట్రంలో ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. బుధవారం 10,093 కరోనా కేసులు రికార్డయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1,20,390కి చేరుకొన్నాయి.

 24 గంటల వ్యవధిలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1676 కేసులు రికార్డయ్యాయి. అనంతపురంలో 1371, చిత్తూరులో 819, గుంటూరులో 1124, కడపలో 734 కేసులు నమోదయ్యాయి.

 కృష్ణాలో 259, కర్నూల్ లో1091, నెల్లూరులో 608, ప్రకాశంలో 242, శ్రీకాకుళంలో496, విశాఖపట్టణంలో841, విజయనగరంలో53, పశ్చిమగోదావరిలో 779 కేసులు నమోదైనట్టుగా ఏపీ ప్రభుత్వం తెలిపింది.

ఒక్క రోజు వ్యవధిలో రాష్ట్రంలో 65 మంది మరణించారు. తూర్పు గోదావరిలో 14 మంది, అనంతపురంలో 8మంది, విజయనగరంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూల్ లో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, కృష్ణాలో నలుగురు, ప్రకాశంలో నలుగురు, గుంటూరులో ముగ్గురు, కడపలో ముగ్గురు, శ్రీకాకుళంలో ఇద్దరు, విశాఖపట్టణం, పశ్చిమగోదావరిలో ఇద్దరేసి చొప్పున మరణించారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకి 55,406 మంది కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇంకా 63,771 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,20,009  మంది శాంపిల్స్ ను పరీక్షించారు. 

రాష్ట్రంలో జిల్లాల వారీగా నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -12,358, మరణాలు 97
చిత్తూరు -9080, మరణాలు 95
తూర్పుగోదావరి -17,739, మరణాలు 148
గుంటూరు -12,816, మరణాలు 112
కడప - 6477, మరణాలు 36
కృష్ణా -6259, మరణాలు157
కర్నూల్ -14,471, మరణాలు 179
నెల్లూరు -5,753, మరణాలు 37
ప్రకాశం - 4443, మరణాలు 53
శ్రీకాకుళం -5582, మరణాలు 65
విశాఖపట్టణం-8559, మరణాలు 92
విజయనగరం -3603, మరణాలు 51
పశ్చిమగోదావరి- 10,356, మరణాలు 91