ఒంగోలు: ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం కొత్తపల్లిలో గురువారం నాడు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతులంతా కర్ణాటక వాసులుగా పోలీసులు గుర్తించారు.

కర్ణాటకకు చెందిన వారు ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.