అనంతపురం: జిల్లాలోని పెనుగొండ మండలంలోని కియా పరిశ్రమ సమీపంలో మంగళవారం నాడు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. స్పీడ్ బ్రేకర్ వద్ద నెమ్మదిగా వెళ్తున్న లారీని కారు వేగంగా ఢీకొట్టింది. మృతుల్లో ఇద్దరు యువకులు, ఇద్దరు యువతులున్నారు.

బెంగుళూరు నుండి హైద్రాబాద్ కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. మృతులంతా ఢిల్లీకి చెందినవారిగా గుర్తించారు. విషయం తెలుసుకొన్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.