టీడీపీకి  చెందిన మాజీ ఎమ్మెల్సీ  వైవీబీ రాజేంద్రప్రసాద్ గుండెపోటుకు  గురయ్యాడు. ఆయనను  ఆసుపత్రిలో  చేర్పించారు  పోలీసులు. 

అమరావతి: టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ కు బుధవారంనాడు గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. విజయవాడ రమేష్ ఆసుపత్రిలో రాజేంద్రప్రసాద్ కు వైద్యులు చికిత్స చేస్తున్నారు. రాజేంద్రప్రసాద్ ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.

రెండు తెలుగు రాష్ట్రాల్లో గుండె పోటు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. చిన్న వయస్సులో ఉన్నవారు కూడ గుండెపోటుకు గురౌతున్నారు. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నవారు గుండెపోటుతో ఆసుపత్రుల్లో చేరిన ఘటనలు అనేకం చోటు చేసుకున్నాయి.

వైవీబీ రాజేంద్రప్రసాద్ కు బాబు పరామర్శ

వైవీబీ రాజేంద్రప్రసాద్ గుండెపోటుకు గురైన విషయం తెలుసుకున్న చంద్రబాబునాయుడు ఫోన్ లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని చంద్రబాబు వైవీబీ రాజేంద్రప్రసాద్ కు సూచించారు. మరో వైపు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో చంద్రబాబు మాట్లాడారు. రాజేంద్ర ప్రసాద్ కు మెరుగైన వైద్యం అందించాలని చంద్రబాబు కోరారు. వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చంద్రబాబుకు చెప్పారు. రాజేంద్రప్రసాద్ కు ప్రాణహానీ లేదని చంద్రబాబుకు వైద్యులు తెలిపారు.