Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుతో ఉండవల్లి భేటీ: విషయమిదే...

ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యేందుకు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్  సోమవారం నాడు సాయంత్రం ఏపీ సచివాలయానికి వచ్చారు.  సీఎంఓ ఆహ్వానం మేరకు ఉండవల్లి అరుణ్ కుమార్  సచివాలయానికి వచ్చినట్టు చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

Former Rajahmundry Mp Vundavalli Arunkumar meets Chandrababunaidu

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యేందుకు రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్  సోమవారం నాడు సాయంత్రం ఏపీ సచివాలయానికి వచ్చారు.  సీఎంఓ ఆహ్వానం మేరకు ఉండవల్లి అరుణ్ కుమార్  సచివాలయానికి వచ్చినట్టు చెప్పడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హమీల అమలు విషయమై  కేంద్ర ప్రభుత్వంపై  ఏపీ ప్రభుత్వం తాడోపేడో తేల్చుకోవాలని భావిస్తోంది. ఈ నెల 18వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాలను పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వంపై మరోసారి అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశపెట్టాలని చంద్రబాబునాయుడు భావిస్తున్నారు.ఈ మేరకు కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నుండి కలుపుకోవాలని టీడీపీ భావిస్తోంది.

విభజన హమీల అమలు విషయమై కేంద్ర ప్రభుత్వం తీరుపై ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ  పిటిషన్ పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్టీడ్ కావాలని గతంలో డిమాండ్ చేశారు.

అయితే  కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం తాడో పేడో తేల్చుకోవాలని భావిస్తోంది. ఈ తరుణంలో   గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యహరించిన ఉండవల్లి అరుణ్ కుమార్  ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో సమావేశమయ్యేందుకు రావడం సంచలనం సృష్టించింది.

సీఎంఓ ఆహ్వానం మేరకు తాను ఏపీ సచివాలయానికి వచ్చినట్టు   ఉండవల్లి అరుణ్ కుమార్  మీడియాకు వివరించారు. చంద్రబాబునాయుడుతో ఉండవల్లి అరుణ్ కుమార్ సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది.

విభజనచట్టం హమీల అమలు కేంద్ర ప్రభుత్వంపై  పోరాటం తదితర అంశాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ తో చంద్రబాబునాయుడు చర్చించే అవకాశాలున్నాయని  సమాచారం. గుంటూరు పర్యటన నుండి అమరావతికి రాగానే చంద్రబాబునాయుడు  ఉండవల్లి అరుణ్ కుమార్ తో సమావేశం కానున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios