కడప టీడీపీలో చిచ్చు: ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలువు: సీఎం రమేష్‌‌కు వరదరాజులురెడ్డి సవాల్

Former Proddatur MLA varadarajulu reddy slams on MP CM Ramesh
Highlights

కడప జల్లాలోని టీడీపీ నేతల మధ్య  గ్రూపుల గొడవలు తారాస్థాయికి చేరుకొన్నాయి. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తమ స్వంత పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్‌పై బహిరంగ విమర్శలకు దిగాడు

కడప: కడప జల్లాలోని టీడీపీ నేతల మధ్య  గ్రూపుల గొడవలు తారాస్థాయికి చేరుకొన్నాయి. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తమ స్వంత పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్‌పై బహిరంగ విమర్శలకు దిగాడు. దమ్ము, ధైర్యం, పౌరుషం ఉంటే  ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలని సీఎం రమేష్‌కు వరదరాజులురెడ్డి సవాల్ విసిరారు.

కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డికి, ఎంపీ సీఎం రమేష్‌కు మధ్య కొంతకాలంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అవకాశం దొరికినప్పుడల్లా  సీఎం రమేష్‌పై వరదరాజులురెడ్డి విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ప్రత్య క్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని వరదరాజులురెడ్డి సీఎం రమేష్‌కు సవాల్ విసిరారు.

సోమవారం నాడు  ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి  సీఎం రమేష్ పై విమర్శలు గుప్పించారు.  దమ్ము, ధైర్యం, పౌరుషం ఉంటే  కడప పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి గెలవాలని  సవాల్ విసిరారు. 

కడప జిల్లాలో పార్టీ నేతల మధ్య గొడవలను పెట్టి గెలిచే స్థానాల్లో కూడ  ఓడిపోయేలా సీఎం రమేష్ చేస్తున్నారని  వరదరాజులు రెడ్డి ఆరోపణలు చేశారు. పులివెందుల మున్సిపాలిటీలో అధికారులతో సమావేశాలను నిర్వహించాలని వరదరాజులు రెడ్డి  సీఎం రమేష్ కు సూచించారు. 

ప్రొద్దుటూరు మున్సిఫల్ కార్యాలయంలో  ఓ వర్గానికి చెందిన టీడీపీ కౌన్సిలర్లను పిలవకుండా భారీ బందోబస్తు మధ్య సమీక్ష సమావేశం నిర్వహించడాన్ని ఆయన తప్పుబట్టారు.  ధనబలంతో ప్రొద్దుటూరులో సీఎం రమేష్ కౌన్సిలర్లను కొనుగోలు చేశారని ఆయన ఆరోపణలు గుప్పించారు. శనివారం నాడు ప్రొద్దుటూరులో చోటు చేసుకొన్న పరిణామాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఆయన చెప్పారు.


 

loader