అనంతపురం: నియంత పాలన ఇంకా ఎంత కాలం ఉంటుందో చూస్తామని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి  పరోక్షంగా ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తాడిపత్రి గనులు, భూగర్భ కార్యాలయం వద్ద  శుక్రవారం నాడు జేసీ దివాకర్ రెడ్డి  ఆందోళనకు సిద్దమయ్యాడు. కొంత కాలంగా ఆయన వ్యవసాయక్షేత్రానికే పరిమితమైన విషయం తెలిసిందే. 

తమ గనులకు అనుమతి ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు.సున్నపురాయి గనుల లీజు విషయంలో జేసీ దివాకర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమకు ఇప్పుడు సన్మానం చేసిన అధికారులకు రెట్టింపు ఉంటుందని ఆయన హెచ్చరించారు.  నియంత పాలన ఎంతకాలం ఉంటుందో మేం చూస్తామన్నారు. దీనికి ఫలితం తప్పక అనుభవించాల్సి వస్తోందన్నారు.

అనవసర విషయాల్లో కేసులు పెట్టి తమ కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్నారని ఆయన చెప్పారు. తన మీద ఎందుకో దయతలచారని ఆయన సెటైర్లు వేశారు.ఈ ప్రభుత్వంలో అధికారులకు రూల్స్ ఉండవన్నారు. బదిలీలకు భయపడి తమపై కేసులు పెడుతున్నారని ఆయన చెప్పారు.