రాజమండ్రి: వైసీపీ ప్రభుత్వం కూడ దళితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ హర్షకుమార్  విమర్శించారు. సోమవారం నాడు ఆయన  మీడియాతో  మాట్లాడారు. దళితులంతా జగన్‌ను సీఎం చేశారన్నారు. కానీ, జగన్ పనితీరు  మాత్రం దళితులకు అనుకూలంగా లేదన్నారు.

రంగంపేట మండలం సింగంపల్లిలో దళితుడిని పంచాయితీ కార్యాలయంలో  అత్యంత కిరాతకంగా హత్య చేసిన దళితుడి హత్య కేసుపై  వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్నారు. 

మామిడికాయలు కోసినందుకే దళితుడిని పంచాయితీ కార్యాలయంలో హత్య చేసి ఉరితీశారన్నారు. ఈ సంఘటనపై సీఎం జగన్‌ స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. హత్య జరిగిన 14 రోజుల్లోనే నిందితులకు బెయిల్ ఇవ్వడం దురదృష్టకరమని హర్షకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.