అమలాపురం: మాజీ ఎంపీ హర్షకుమార్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఎన్నికల ముందు హర్షకుమార్ కాంగ్రెస్ పార్టీని వీడారు. తొలుత టీడీపీ, ఆ తర్వాత వైసీపీలో చేరారు. వైసీపీకి కూడా ఆయన దూరంగా ఉంటున్నారు.

also read:కాంగ్రెస్ పార్టీలో చేరుతా: అమలాపురంం మాజీ ఎంపీ హర్షకుమార్

ఏపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలను ఆయన తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే.  కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ ఉమెన్ చాందీ , కాంగ్రెస్ పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ సమక్షంలో హర్షకుమార్  సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆయన చెప్పారు.రాష్ట్ర ప్రజలు మరోసారి మోసపోవడానికి సిద్దంగా లేరని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఆయన తెలిపారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హర్షకుమార్ పై కేసు నమోదైంది. గోదావరి నదిలో బోటు మునక పై కూడ ప్రభుత్వంపై, కొందరు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై ఎంపీ సీరియస్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.