రాజమండ్రి: కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నానని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ప్రకటించారు.

శుక్రవారం నాడు ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ లో దళిత యువతిపై అత్యాచారం, హత్య ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కాలినడకన వెళ్తున్నా వారిపై పోలీసులు వ్యవహరించిన తీరును ఆయన తప్పుబట్టారు.

దళితులపై దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని ఈ ఘటనతో అర్ధమౌతోందన్నారు.దళితుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీలు చేస్తున్న పోరాటం తనను ఇంప్రెస్ చేసిందన్నారు.

also read:అత్యాచారాల్లో యూపీ తర్వాత ఏపీనే: మాజీ ఎంపీ హర్షకుమార్ సీరియస్ కామెంట్స్

ఈ కారణంగానే తాను కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా ఆయన చెప్పారు.ముఖ్యమంత్రి జగన్ కేసుల నుండి తప్పించుకొనేందుకుగాను  కేంద్రం కాళ్లపై పడుతున్నారని ఆయన ఆరోపించారు. కార్పోరేట్ శక్తుల ప్రయోజనాలను కాపాడేందుకు ఏర్పడిన పార్టీ బీజేపీ అని ఆయన విమర్శించారు.దేశంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యూపీ తర్వాతే ఏపీలోనే అత్యాచారాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన ఆరోపించారు.