Asianet News TeluguAsianet News Telugu

జగన్ వోటమిని ఇలా అడ్డుకోవచ్చు...ఒక మిత్రుడి సలహా

1994-2004 వరకు వైస్సార్ ను స్టడీ చేయాలి వైసీపీ

జగన్ గారు పరిణితి చెందిన నాయకులు లాగా కనపడాలి

స్థానిక నాయకత్వాన్ని గుర్తించి అక్కడ లోకల్ సమస్యలపై పోరాటం చేయించాలి

former mp GV Harshakumars advice to ycp supremo jaganmohan reddy

 

హర్ష కుమార్ అమలాపురం మాజీ ఎంపి. వి.హనుమంతరావు అనుచరుల్లో ఒకరు. తర్వాత ఆయన ఎంపి అయ్యాక స్వతంత్రంగా ఎదిగారు.  అధిష్టానం కంటబడ్డారు.  రాజమండ్రి రాజకీయాల కారణంగా ఆయన వై ఎస్ రాజశేఖర్ రెడ్డితో పడలేదు. 2009 ఎన్నికలపుడు ఆయనకు టికెట్ రాకుండా వైఎస్ ప్రయత్నించినా, హర్షకుమార్ టికెట్ తెచ్చుకున్నారు. తర్వాత ఆయన రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలోకి వచ్చారు. ఆయన అభిమానించడం మొదలు పెట్టారు. అంతా సవ్యంగా జరిగితే వైసిపిలోకి వచ్చినా ఆశ్చర్యంలేదు.నంద్యాల ఎన్నికల్లో వైసిపి వోడిపోవడం, తెలుగుదేశం పార్టీ గెలుపొందడంతో ఆయన చాలా క్రుంగిపోయానని ఫేస్ బుక్ రాసుకొచ్చారు. కాంగ్రెస్ లో ఉంటూ వైసిపి గెలుపును ఆయన మనసారా కాంక్షించినట్లున్నారు, నంద్యాల ఎన్నికల ఫలితాలమీద తన అభిప్రాయం  వ్యక్తీకరించకుండా ఉండలేకపోయారు. టిడిపి గెలుపును చూడలేకపోతున్నవారిలో తాను ముందుంటానని అంటూ భవిష్యత్తులో మళీ ఇలాంటి పరాజయం ఎదుకుకాకుండా ఉండేందుకు  వైసిసి అధినేత జగన్ కు ఆయన ఒక చిన్న సలహా ఇస్తున్నారు. ఇలా చేయడంలో హర్షకుమార్ చాలా వినయం ప్రదర్శించారు. హుందాగా చెప్పారు. అవతలి పార్టీ వ్యక్తికి ఇలాంటి సలహా ఇవ్వడం తప్పయితే క్షమించండని కూడా అడిగారు.

ఇలా చేస్తే బాగుంటుందంటున్నారు హర్షకుమార్

 జగన్ మొదటి సారి  ఉప ఎన్నికలలో 30 సీట్లకు 28 గెలిచారు. టీడీపీ మూడో స్థానంలోకి పడపోయింది. తర్వాత, state విడిపోయిన తర్వాత కచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్టాదని అందరూ ఊహించారు.చాలా తక్కువ మార్జిన్లో వైసీపీ ఓడిపోయింది.ఇప్పుడు by election లో చంద్రబాబు ప్రలోభాలకు ప్రజలు లొంగిపోయారు.దీనిని ఎలా ఎదుర్కొనాలి?

 1995 -99 మధ్య 4 సంవత్సరాల cbn(చంద్రబాబు నాయుడు) పరిపాలనను వైస్సార్ ఎండగట్టి ఎంత పోరాటం చేసినా cbn నే నెగ్గారు.తర్వాత 1999-2004 లో వరకు మళ్ళీ వైస్సార్ తానే సర్వసం అయి congress పార్టీ ని ఒక యుద్ధానికి సన్నద్ధం చేశారు. సక్సెస్ అయ్యారు.పరిపాలన అంటే ఏమిటి అనేది చూపించారు. ప్రజలను అక్కున చేర్చుకున్నారు.1994-2004 వరకు వైస్సార్ ను స్టడీ చేయాలి వైసీపీ. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ  ప్రజలను జాగృతం చేయడం ,సన్నద్ధులను చేయడం స్థానిక నాయకత్వాన్ని గుర్తించి అక్కడ లోకల్ సమస్యలపై పోరాటం చేయడం... వైసీపీ ఇవ్వన్నీ చేయాలి. జగన్ గారు పరిణితి చెందిన నాయకులు లాగా కనపడాలి. ఆయనకు ఎంతో సబ్జెక్ట్ తెలుసు. దాన్ని ప్రెజెంట్ చేసే టప్పుడు ప్రజల గుండెలలోకి వెళ్ళేటట్టు చూసుకోవాలి.ఇది నాకు చెప్పాలనిపించింది. ఎందుకంటే టీడీపీ గెలుపు చూడలేని వ్యక్తులతో నేను ముందుఉంటాను కాబట్టి.ఏమైనా ఎక్కువ మాట్లాడితే క్షంతవుడ్ని.

Follow Us:
Download App:
  • android
  • ios