రాయచోటి: కడప జిల్లాలోని రాయచోటి మాజీ ఎమ్మెల్యే ఎం. నారాయణరెడ్డి గురువారం నాడు మృతి చెందారు. కొంత కాలంగా ఆయన  అనారోగ్యంతో బాధపడుతున్నారు. 

1994లో జరిగిన ఉప ఎన్నికలు ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో  కాంగ్రెస్ తరపున  ఆయన రెండు పర్యాయాలు  శాసనసభకు ఎన్నికయ్యారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా నారాయణరెడ్డికి పేరుంది. నారాయణరెడ్డికి ఓ కొడుకు, కూతురు ఉన్నారు.

రాయచోటి నియోజకవర్గంలో  పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నారాయణరెడ్డి కీలకంగా వ్యవహరించారు.  నారాయణరెడ్డి మృతితో పలు పార్టీల నేతలు సంతాపాన్ని వ్యక్తం చేశారు.